Telangana Schools Holiday : తెలంగాణలో రేపు స్కూల్స్ సెల‌వు.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ‌,ప్రైవేటు స్కూల్స్‌కు రేపు సెల‌వు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ జూన్ 26వ తేదీ (సోమ‌వారం) పాఠశాలల బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్ కూమారు ఒక ప్రకటనలో తెలిపారు.
TS Schools Holiday

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ 

విద్యా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 26న పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో 15వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని ప్రభుత్వం భర్తీ చేయడం లేదన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం వెంటనే అందజేయాలని, మౌలిక వసతులు కల్పించాలని, డీఎస్సీ, ఎంఈవో పోస్టులకు సంబంధించిన ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నారు.

చ‌ద‌వండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

గుర్తింపు లేకున్నా నడిపిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, అధిక ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ధరకు పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

2023-24 స్కూల్స్ అకాడమిక్ కాలెండర్ ఇదే.. ఈ ఏడాది సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..

తెలంగాణ విద్యాశాఖ మాత్రం అప్పుడే ఈ ఏడాది విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ఖరారు చేసింది. 2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్ విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే.. జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అలాగే.. వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి పనిదినంగా నిర్ణయించింది. అలాగే సెల‌వుల వివ‌రాలు కూడా ప్ర‌క‌టించింది.

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు  పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి 
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.

#Tags