Schools Holidays : వార్నింగ్.. ఏప్రిల్ 1వ తేదీ వ‌ర‌కు స్కూల్స్‌కు సెలవులు.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. మేము చెప్పేవ‌ర‌కు తెరవొద్దు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్స్ రీఓపెనింగ్ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తన అనుబంధ పాఠశాలలను తీవ్రంగా హెచ్చరించింది. ఏప్రిల్ 1వ వ‌ర‌కు స్కూల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని ఆదేశించింది.
Schools Holidays Details

ఇలా కాదని యాజమాన్యాలు క్లాసులు ప్రారంభిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. పది, పన్నెండో తరగతి విద్యార్థులకు అకడమిక్ సంవత్సరం ప్రారంభానికి ముందే క్లాసులు ప్రారంభిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సీబీఎస్ ఈ తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

➤☛ Telangana Schools Summer Holidays 2023 : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్ 25వ తేదీ నుంచి స్కూల్స్‌కు వేసవి సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే..?

☛➤ Ap Schools Summer Holidays 2023 : స్కూళ్లకు మొత్తం వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..? ఈ సారి ముందుగానే..

విద్యార్థులపై..

అకడమిక్ సంవత్సరం ప్రారంభానికి ముందే కొన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలు క్లాసులు ప్రారంభిస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. నిర్దేశించిన సమయం కంటే ముందుగానే సిలబస్ పూర్తి చేసేందుకు ప్రయత్నించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వాళ్లు తీవ్ర అందోళనకు గురవుతారు. ప్రశాంతంగా నేర్చుకునేందుకు వీలుండదు.సీబీఎస్ఈ పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్, ఆరోగ్యం, వ్యాయామం, సామాజిక సేవ తదితర బోధనేతర అంశాలపై దృష్టి సారించేందుకు విద్యార్థులకు పాఠశాలలు తగినంత సమయం ఇవ్వడం లేదని, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అనురాగ్ తెలిపారు.

☛➤ Schools and Colleges Holiday 2023 : మార్చి నెలలో స్కూళ్లు, కాలేజీలకు 8 రోజులు సెలవులు.. ఎలా అంటే..?

ఏప్రిల్ 1 నుంచి తిరిగి మార్చి 31 వరకు..

విద్యార్థికి చదువుతోపాటు బోధనేతర అంశాలు కూడా ముఖ్యమే. సీబీఎస్ఈ అనుంబంధ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలు బోర్డు జారీ చేసిన షెడ్యూల్ను కచ్చితంగా అమలు చేయాల్సిందే. ఏప్రిల్ 1 నుంచి తిరిగి మార్చి 31 వరకు సీబీఎస్ఈ నిర్దేశించిన షెడ్యూల్ యథాతథంగా అమలయ్యేలా వారు చర్యలు తీసుకోవాలి అని అనురాగ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోతరగతి, పన్నెండో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ ప్రస్తుతం బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ రెండు తరగతులకు ఫిబ్రవరి 15న పరీక్షలు ప్రారంభమయ్యాయి. పదో తరగతి విద్యార్థులకు మార్చి 21న, పన్నెండో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 5తో పరీక్షలు ముగియనున్నాయి.

టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

#Tags