School Holidays: ఇక్కడ స్కూళ్లన్నీ బంద్.. కార‌ణం ఇదే..

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు నాణ్యత నానాటికీ క్షీణిస్తూ గుబులు రేపుతోంది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ న‌వంబ‌ర్‌ 17న రాత్రి ఏకం గా 457కు పడిపోయింది.

దాంతో కాలుష్య నియంత్రణ దృష్ట్యా ఇప్పటికే అమల్లో ఉన్న ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. న‌వంబ‌ర్‌ 18 నుంచి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 కేటగిరీ ఆంక్షలు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఆదే శాల దాకా ఇవి కొనసాగుతాయని పేర్కొంది.

నిత్యావసరాలు, అత్యవసర సేవలను మినహా యించి మిగతా అన్ని రకాల ట్రక్కులకూ ఎన్ సీఆర్ పరిధిలోకి ప్రవేశాన్ని నిషేధించారు. ఐదో తరగతి వరకు మాత్రమే ఉన్న ఆన్లైన్ క్లాసులను 6 నుంచి 11వ తరగతి దాకా వర్తిం పజేయనున్నట్టు సీఎం ఆతిషి ప్రకటించారు.

చదవండి: Adarsh: గుడ్‌ ఐడియా.. ఎలక్ట్రిక్‌ సైకిల్‌ తయారు చేసి దానిపై బడికి

తదుపరి ఉత్తర్వుల వరకు ఆన్లైన్ క్లాసులు కొనసాగుతాయని వివరించారు. కార్యాలయా లన్నీ సగం సామర్థ్యంతోనే నడపాలని ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం సూచించింది. మిగతా వారికి వర్క్ ఫ్రం ఆప్షన్ ఇవ్వాలని పేర్కొంది. దీన్ని కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కూడా వర్తింపజేయాలని కోరింది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

వీటితో పాటు ఢిల్లీలో కొంతకాలం పాటు వాహనా లకు సరి-బేసి విధానాన్ని మళ్లీ అమలు చేయాలని కూడా భావిస్తున్నారు. పొగ మం చు కారణంగా ఢిల్లీలో పదుల కొద్దీ విమాన సేవలు ప్రభావితమయ్యాయి. చాలా విమనాలు రదయ్యాయి.

#Tags