Medical Health Department: ఈ ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్‌ సీట్లలో రిజర్వేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి ఉద్యోగులకు, వారి పిల్లలకు శుభవార్త. పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్‌ కాలేజీ పేరును సింగరేణి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (సిమ్స్‌)గా మార్చడంతోపాటు, అక్కడి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్‌ సీట్లలో రిజర్వేషన్‌ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్‌ సీట్లలో రిజర్వేషన్‌

సింగరేణి ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ జూలై 6న ఉత్తర్వులు జారీచేశారు. రామగుండం మెడికల్‌ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్‌ సీట్లుండగా, 23 సీట్లు ఆలిండియా కోటాకి వెళ్తాయి. మిగతా 127 ఎంబీబీఎస్‌ సీట్లలో 5% రిజర్వేషన్‌ ప్రకారం, అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేటాయించనున్నారు.

చదవండి: Singareni Thermal Power Plant: అగ్రస్థానంలో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం

నీట్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పరిగణనలోకి తీసుకుంటారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కాగా, ఈ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలోని 50 శాతం పడకలను సింగరేణి ఉద్యోగులకు కేటాయించినట్లు ప్రకటించారు. ఇదిలావుండగా, తెలంగాణ మెడికల్, డెంటల్‌ కాలేజీల అడ్మిషన్‌ నిబంధనలను కొన్నింటికి సవరణలు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొ ంది. ఇవన్నీ కూడా గతంలో ఉన్న ఉత్తర్వులేనని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

చదవండి: Singareni: సింగరేణికి ఐఈఐ ఇండస్ట్రీ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం

#Tags