Scholarship: ప్రతిభకు ప్రోత్సాహం

అదనపు తరగతులు

రోజూ పాఠశాలలో అదనపు తరగతిని నిర్వహించి ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు ఉపాధ్యాయులను సన్నద్ధం చేస్తున్నారు. నాలుగు నెలలుగా పాఠశాలలో ఉదయం, సాయంత్రం ప్రిపేర్‌ అవుతున్నాం. కచ్చితంగా విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది.
– బి.సంతోషిణి, 8వ తరగతి విద్యార్థిని, జెడ్పీహెచ్‌ఎస్‌, వెంటూరు, రాయవరం మండలం

ఏటా శిక్షణ

పదేళ్లుగా ఏటా విద్యార్థులను ఎన్‌ఎంఎంఎస్‌ ప్రవేశ పరీక్షకు సన్నద్ధం చేస్తున్నాం. గతేడాది మా పాఠశాలలో 10 మంది ఎంపికయ్యారు. ఈ ఏడాది కూడా రోజూ అదనపు తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు శిక్షణనిచ్చాం.
– విత్తనాల సుబ్బారావు, మున్సిపల్‌ హైస్కూల్‌ రత్నంపేట, రామచంద్రపురం

సీఎస్‌, డీవోల నియామకం పూర్తి

ఎన్‌ఎంఎంఎస్‌ ప్రవేశ పరీక్షకు సీఎస్‌, డీవోల నియామకం పూర్తి చేశాం. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం.
– నక్కా సురేష్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం, కోనసీమ జిల్లా

#Tags