Central University of AP: ఏకకాకంలో రెండు డిగ్రీలకు అవకాశం

అనంతపురం: సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీలో వివిధ కోర్సులకు సంబంధించి మల్టీ ఎంట్రీ, మల్టీ ఎగ్జిట్‌ విధానం పాటిస్తున్నామని, దీంతో మేజర్‌, మైనర్‌ రెండు డిగ్రీలను ఏకకాలంలో తీసుకునే అవకాశం ఉందని వర్సిటీ వీసీ డాక్టర్‌ ఎస్‌.ఏ కోరి తెలిపారు. నూతన జాతీయ విద్యావిధానం–2020 మూడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆయన సెంట్రల్‌ వర్సిటీలో విలేకరులతో మాట్లాడారు. మారుతున్న పరిస్థితులు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉద్యోగావకాశాలు దక్కేలా ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశామన్నారు. పీజీ విద్యార్థులకు సామాజిక స్పృహ కలిగి ఉండాలన్న ఉద్దేశంతో మానవ విలువలు, పర్యావరణం, భారత రాజ్యాంగం, సైబర్‌ సెక్యూరిటీ వంటి సబ్జెక్టులను తప్పనిసరి చేశామన్నారు. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీలో 21 రాష్ట్రాలకు చెందిన 600 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఈ ఏడాది యూజీ, పీజీ కోర్సుల్లోని 358 సీట్లకు గాను 2.20 లక్షల దరఖాస్తులు అందాయన్నారు. 2024లో జంతలూరు క్యాంపస్‌ నుంచి తరగతులు నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ డీన్‌ రాంరెడ్డి, సెంట్రల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కరీంఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

AP Open School Admission 2023: ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్య బోధన ఈవిద్యాసంవత్సరం 358 సీట్లకు 2.20 లక్షల దరఖాస్తులు సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ వీసీ డాక్టర్‌ ఎస్‌.ఏ కోరి
 

#Tags