PJTSAU: వ్యవసాయ వర్సిటీలో డ్రోన్ అకాడమీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రి డ్రోన్ పైలట్ శిక్షణకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి ఇచ్చింది.
రైతు లు, డిప్లొమా హోల్డర్లు, అగ్రి గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగ గ్రామీణ యువతకు అగ్రి–డ్రోన్ పైలట్ శిక్షణను అందించేందుకు డ్రోన్ అకాడమీని స్థాపిస్తున్నారు. అందులో పదేళ్లు శిక్షణ ఇవ్వడానికి ఈమేరకు అనుమతి లభించింది.
చదవండి: ‘డ్రోన్ల’పై స్వల్పకాలిక కోర్సులు ఇవే..
తెలంగాణలో ప్రధాన పంటలైన వరి, పత్తి, వేరుశనగ, సోయాబీన్, నువ్వులు, కుసుమ వంటి పంటల్లో డ్రోన్ ఆధారిత పురుగుమందులను పిచికారీ చేయడానికి ఇది దోహదపడుతుంది. ఈ అకాడమీ త్వరలో రాజేంద్రనగర్‌లో ప్రారంభం కానుంది. అగ్రిడ్రోన్ పైలట్ శిక్షణా కోర్సును 6 రోజుల పాటు అందిస్తారు.
#Tags