‘డ్రోన్ల’పై స్వల్పకాలిక కోర్సులు ఇవే..
ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంట్‌లో వెల్లడించింది. డ్రోన్ల తయారీ, టెక్నీషియన్, పర్యవేక్షణ, నిర్వహణ, కిసాన్ డ్రోన్ ఆపరేటర్ తదితర కోర్సులకు అనుమతిచ్చినట్లు తెలిపింది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.
చదవండి: Smart drone: గిడ్డంగుల నిర్వహణకు ‘స్మార్ట్ డ్రోన్’
ఇందులో భాగంగా ఐటీఐల్లో డ్రోన్లకు సంబంధించిన నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరగా.. ఏపీలోని 10 ఐటీఐల్లో స్వల్పకాలిక కోర్సులకు కేంద్రం అనుమతిచ్చింది. అలాగే అసోం, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్, చండీగఢ్, గుజరాత్, మహారాష్ట్ర, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కూడా కేంద్రం అనుమతి మంజూరు చేసింది.
చదవండి: బిట్స్‌లో ఘనంగా ‘అట్మాస్’
డ్రోన్స్ స్వల్పకాలిక కోర్సులు
కోర్సు |
సమయం |
డ్రోన్ డెవలపర్(సాఫ్ట్‌వేర్) |
510 గంటలు |
డ్రోన్ మాన్యుఫాక్చరింగ్ అండ్ అసెంబ్లీ టెక్నీషియన్ |
390 గంటలు |
డ్రోన్ మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్ అసోసియేట్ |
390 గంటలు |
డ్రోన్ ఆపరేటర్ మల్టీ రోటర్ |
390 గంటలు |
డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్ |
400 గంటలు |
కిసాన్ డ్రోన్ ఆపరేటర్ |
390 గంటలు |