Smart drone: గిడ్డంగుల నిర్వహణకు ‘స్మార్ట్ డ్రోన్’
Sakshi Education
గిడ్డంగుల నిర్వహణ, శాంతిభద్రతల పర్యవేక్షణ, సైనికులకు ఉపయోగకరంగా ఐఐటీ గువహటిలోని ఏరోమోడెలింగ్ క్లబ్ విద్యార్థులు పలు అధునాతన డ్రోన్ లను అభివృద్ధి చేశారు. గిడ్డంగుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా వేర్‌హౌజ్ డ్రోన్ లను తయారుచేశారు. గిడ్డంగుల్లో మనుషులకు కష్టమైన పనులను ఈ డ్రోన్ లు చేస్తాయి. వీటికి మరింత సాంకేతికత జోడించి భవిష్యత్తులో వస్తువులు డెలివరీ చేసేలా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సైనిక, శాంతిభద్రతల పర్యవేక్షణ అవసరాలకు రీపర్ డ్రోన్‌లను రూపొందించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 14 Jan 2023 12:44PM