Skip to main content

బిట్స్‌లో ఘనంగా ‘అట్మాస్‌’

సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని బిట్స్‌ పిలానీ వేదికగా అట్మాస్‌ 22 వేడుకలను ఘనంగా నిర్వహించారు.
atmos program in bits Hyderabad
బిట్స్‌లో ఘనంగా ‘అట్మాస్‌’

కార్యక్రమంలో టాలీవుడ్‌ స్టార్‌ అడవి శేష్‌ సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఇండియన్‌ డ్రోన్‌ రేసింగ్‌ లీగ్, ఫార్ములా–ఈ షో కార్, రోబోవార్స్‌ ఆకట్టుకున్నాయి. బిట్స్‌ విద్యార్థుల ఆధ్వర్యంలో ఇన్‌క్లూడెడ్‌–5జీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, రోబోటిక్‌ 101, రాకెట్రీ వంటి పలు వర్క్‌షాప్స్, ఎక్స్‌పోలు హైలెట్‌గా నిలిచాయి.

చదవండి: BITS Pilani: ఆన్‌లైన్‌లో బిట్స్‌ పిలానీ బీఎస్సీ డిగ్రీ

సెమినార్లలో విద్యార్థులనుద్దేశించి ఆల్ఫా ‘జీక్‌’ సందీప్‌ జైన్, మేజర్‌ గౌరవ్‌ ఆర్యాలు మాట్లాడారు. డీజే ఆనంద్‌ భాస్కర్, పాప్‌స్టార్‌ అర్జున్‌ కనుంగోలు ఆధ్వర్యంలో యస్టర్‌నైట్‌ కన్సర్ట్‌ ఉత్సాహంగా సాగింది. 

చదవండి: బిట్స్ నుంచి ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు

Published date : 28 Nov 2022 03:43PM

Photo Stories