బిట్స్ నుంచి ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు
Sakshi Education
దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్)-పిలానీ ఒకటి. ఈ ఇన్‌స్టిట్యూట్ 2014-15 విద్యా సంవత్సరంలో మొదటి సెమిస్టర్‌లో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు...
బిట్స్-పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌ల ద్వారా ఈ కోర్సులను ఆఫర్ చేస్తుంది. క్యాంపస్‌ల వారీగా అందిస్తున్న కోర్సులు..
టాపర్లకు నేరుగా:
దేశంలో గుర్తింపు పొందిన రాష్ట్ర/కేంద్ర బోర్డుల నుంచి 12వ తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు బిట్‌శాట్-2014 స్కోర్‌తో నిమిత్తం లేకుండా వారికిష్టమైన కోర్సులో నేరుగా ప్రవేశం కల్పిస్తారు. ఈ క్రమంలో పీసీఎం (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) విద్యార్థులు ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ఏ కోర్సు కోసమైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పీసీబీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) విద్యార్థులు బీఫార్మసీ (ఆనర్స్) కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పవేశం పొందాక:
ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఎంచుకున్న కోర్సును నాలుగు సంవత్సరాల(ఎనిమిది సెమిస్టర్లు)లో పూర్తి చేసే అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ కోర్సు రూపకల్పనలో అనుసరించిన ప్రత్యేక విధానంతో కొందరు విద్యార్థులు నాలుగేళ్లలోపు కోర్సును పూర్తి చేస్తే మరికొందరు నాలుగేళ్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటారు. డ్యూయల్ డిగ్రీ విధానం కింద రెండు కోర్సులను ఎంచుకున్న విద్యార్థులు ఐదు నుంచి ఐదున్నరేళ్ల (10 నుంచి 11 సెమిస్టర్లు) కాలంలో కోర్సును పూర్తి చేయాలి. ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రాక్టీస్ స్కూల్ అవకాశాన్ని కూడా కల్పిస్తారు.
పాక్టీస్ స్కూల్ ప్రత్యేకత:
ఆయా బ్రాంచ్‌లలో చేరిన విద్యార్థుల వాటికి సంబంధించి నిరంతర ప్రాక్టీస్‌కు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకోవడం, తద్వారా క్షేత్ర స్థాయి నైపుణ్యాలను తొలి రోజు నుంచే సొంతం చేసుకునేలా సిలబస్‌ను రూపొందించడం.. బిట్స్ ప్రత్యేకత’. ఆయా కోర్సుల స్వరూపం సెమిస్టర్ విధానంలో ఉంటుంది. ఒక విద్యార్థి పనితీరును నిరంతర మూల్యాంకనం చేయడానికి వీలుగా ఈ సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తారు.
కమ్యూనికేషన్.. కంటిన్యూయస్:
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పని సరిగా మారుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న బిట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌లో నైపుణ్యాలను నిరంతర శిక్షణాంశాలుగా బోధిస్తుంది. అదే విధంగా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. వీటిలో కొన్ని.. ఆయా కోర్సులకు సంబంధించి అనుబంధంగా ఉంటే (ఉదా: ఆయా బ్రాంచ్‌లకు సంబంధించి నిర్వహించే ఖ్ఛ్ఞీజీఞ ప్రోగ్రాంలు).. మరికొన్ని యాక్టివిటీస్ విద్యార్థుల్లో మానసికోల్లాసాన్ని పెంపొందించేలా, సామాజిక అంశాలపై అవగాహన కలిగించేలా ఉంటాయి.
ప్రతిభకూ.. ప్రోత్సాహకాలు:
అదే విధంగా బిట్‌శాట్‌లో మెరిట్ ఆధారంగా.. మెరిట్, మెరిట్ కమ్ మీన్స్ అని రెండు రకాలుగా ఆర్థిక చేయూతనిస్తోంది. ఈ క్రమంలో ఫీజు మినహాయింపు, స్కాలర్‌షిప్ వంటి ప్రోత్సాహకాలు అందిస్తోంది. అకడెమిక్‌గా ప్రతిభ ఉన్న విద్యార్థులకు చేయూతనందించే ఉద్దేశంతో సీబీఎస్‌ఈ, ఆయా రాష్ట్రాల బోర్డులు నిర్వహించే ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల్లో స్టేట్ టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు నచ్చిన క్యాంపస్‌లో మెచ్చిన బ్రాంచ్‌లో చదువుకునే సదుపాయం కల్పిస్తుంది.
నోటిఫికేషన్ సమాచారం:
అర్హత:10+2 విధానంలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లతో 12వ తరగతి ఉత్తీర్ణత. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ఒక్కో సబ్జెక్ట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ మూడు సబ్జెక్ట్‌లు కలిపి 75 శాతం మార్కులు సాధించాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రింట్ తీసుకుని సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి ‘డీన్, అడ్మిషన్స్, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్‌స (బిట్స్)-పిలానీ-333031 (రాజస్థాన్)’ చిరునామాకు పంపాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 30, 2014.
వివరాలకు: bitsadmission.com

- బిట్స్-పిలానీ: బీఈ ఆనర్స్- కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మాన్యుఫాక్చరింగ్, మెకానికల్, ఎంఎస్సీ (ఆనర్స్) బయాలజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. ఎంఎస్సీ (టెక్) ఫైనాన్స్, జనరల్ స్టడీస్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ బీఫార్మసీ (ఆనర్స్)
- బిట్స్-గోవా: బీఈ ఆనర్స్-కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్ , ఎంఎస్సీ (ఆనర్స్) బయాలజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. ఎంఎస్సీ (టెక్) ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్.
- బిట్స్-హైదరాబాద్: బీఈ (ఆనర్స్): కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మాన్యుఫాక్చరింగ్, మెకానికల్ ఎంఎస్సీ (ఆనర్స్) బయాలజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. ఎంఎస్సీ (టెక్) ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. బీఫార్మసీ (ఆనర్స్)
టాపర్లకు నేరుగా:
దేశంలో గుర్తింపు పొందిన రాష్ట్ర/కేంద్ర బోర్డుల నుంచి 12వ తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు బిట్‌శాట్-2014 స్కోర్‌తో నిమిత్తం లేకుండా వారికిష్టమైన కోర్సులో నేరుగా ప్రవేశం కల్పిస్తారు. ఈ క్రమంలో పీసీఎం (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) విద్యార్థులు ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ఏ కోర్సు కోసమైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పీసీబీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) విద్యార్థులు బీఫార్మసీ (ఆనర్స్) కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పవేశం పొందాక:
ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఎంచుకున్న కోర్సును నాలుగు సంవత్సరాల(ఎనిమిది సెమిస్టర్లు)లో పూర్తి చేసే అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ కోర్సు రూపకల్పనలో అనుసరించిన ప్రత్యేక విధానంతో కొందరు విద్యార్థులు నాలుగేళ్లలోపు కోర్సును పూర్తి చేస్తే మరికొందరు నాలుగేళ్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటారు. డ్యూయల్ డిగ్రీ విధానం కింద రెండు కోర్సులను ఎంచుకున్న విద్యార్థులు ఐదు నుంచి ఐదున్నరేళ్ల (10 నుంచి 11 సెమిస్టర్లు) కాలంలో కోర్సును పూర్తి చేయాలి. ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రాక్టీస్ స్కూల్ అవకాశాన్ని కూడా కల్పిస్తారు.
పాక్టీస్ స్కూల్ ప్రత్యేకత:
ఆయా బ్రాంచ్‌లలో చేరిన విద్యార్థుల వాటికి సంబంధించి నిరంతర ప్రాక్టీస్‌కు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకోవడం, తద్వారా క్షేత్ర స్థాయి నైపుణ్యాలను తొలి రోజు నుంచే సొంతం చేసుకునేలా సిలబస్‌ను రూపొందించడం.. బిట్స్ ప్రత్యేకత’. ఆయా కోర్సుల స్వరూపం సెమిస్టర్ విధానంలో ఉంటుంది. ఒక విద్యార్థి పనితీరును నిరంతర మూల్యాంకనం చేయడానికి వీలుగా ఈ సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తారు.
కమ్యూనికేషన్.. కంటిన్యూయస్:
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పని సరిగా మారుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న బిట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌లో నైపుణ్యాలను నిరంతర శిక్షణాంశాలుగా బోధిస్తుంది. అదే విధంగా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. వీటిలో కొన్ని.. ఆయా కోర్సులకు సంబంధించి అనుబంధంగా ఉంటే (ఉదా: ఆయా బ్రాంచ్‌లకు సంబంధించి నిర్వహించే ఖ్ఛ్ఞీజీఞ ప్రోగ్రాంలు).. మరికొన్ని యాక్టివిటీస్ విద్యార్థుల్లో మానసికోల్లాసాన్ని పెంపొందించేలా, సామాజిక అంశాలపై అవగాహన కలిగించేలా ఉంటాయి.
ప్రతిభకూ.. ప్రోత్సాహకాలు:
అదే విధంగా బిట్‌శాట్‌లో మెరిట్ ఆధారంగా.. మెరిట్, మెరిట్ కమ్ మీన్స్ అని రెండు రకాలుగా ఆర్థిక చేయూతనిస్తోంది. ఈ క్రమంలో ఫీజు మినహాయింపు, స్కాలర్‌షిప్ వంటి ప్రోత్సాహకాలు అందిస్తోంది. అకడెమిక్‌గా ప్రతిభ ఉన్న విద్యార్థులకు చేయూతనందించే ఉద్దేశంతో సీబీఎస్‌ఈ, ఆయా రాష్ట్రాల బోర్డులు నిర్వహించే ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల్లో స్టేట్ టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు నచ్చిన క్యాంపస్‌లో మెచ్చిన బ్రాంచ్‌లో చదువుకునే సదుపాయం కల్పిస్తుంది.
నోటిఫికేషన్ సమాచారం:
అర్హత:10+2 విధానంలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లతో 12వ తరగతి ఉత్తీర్ణత. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ఒక్కో సబ్జెక్ట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ మూడు సబ్జెక్ట్‌లు కలిపి 75 శాతం మార్కులు సాధించాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రింట్ తీసుకుని సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి ‘డీన్, అడ్మిషన్స్, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్‌స (బిట్స్)-పిలానీ-333031 (రాజస్థాన్)’ చిరునామాకు పంపాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 30, 2014.
వివరాలకు: bitsadmission.com
Published date : 05 Jun 2014 04:39PM