DEO Vasanthi: ఎడ్యుకేషన్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలో పాల్గొనాలి

కాళోజీ సెంటర్‌: జిల్లా వ్యాప్తంగా 3వ, 6వ, 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించే స్టేట్‌ ఎడ్యుకేషన్‌ అచీవ్‌మెంట్‌ సర్వే(సీఎస్‌)ను విజయవంతం చేయాలని డీఈఓ వాసంతి పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న డీఈఓ వాసంతి

విద్యావ్యవస్థల తీరుతెన్నులు, సామర్థ్యాలను అంచనావేసే ఈ కా ర్యక్రమంలో అందరు పాల్గొనాలని డీఈఓ సూచించారు. ఈమేరకు సుబేదారిలోని ప్రభుత్వ పాఠశాలలో సీఎస్‌ సర్వేపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డీఈఓ మాట్లాడారు. సీఎస్‌ సర్వేలో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఎన్‌సీఈఆర్టీ, ఎస్సీ ఈఆర్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్‌ 3వ తేదీన సీఎస్‌ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 531 పాఠశాలలో ఈ సర్వే ఉంటుందని తెలిపారు.

చదవండి: నాగజ్యోతికి విద్యాశాఖ కమిషనర్‌ అభినందన

సర్వేలో 580 మంది ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్స్‌ పాల్గొంటారని, ప్రతి మండలానికి ఇద్దరు నుంచి నలుగురు చొప్పున బ్లాక్‌ లెవల్‌ కోఆర్డినేటర్లుగా, ఎంఎన్‌ఓ, ఎంఈఓలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్లు సేవలు అందించాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డైట్‌ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ వెంకటమయ్య, జెండర్‌ కోఆర్డినేటర్‌ కె.ఫ్లోరిన్స్‌, అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి మాలోతు సారయ్య, ఓవీఓలు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

#Tags