నాగజ్యోతికి విద్యాశాఖ కమిషనర్ అభినందన
నాగజ్యోతి నేపాల్‌లో అక్టోబర్ 5 నుంచి 9 వరకు జరిగిన సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్(ఎస్‌కేబీఎఫ్) పోటీల్లో నాలుగు పతకాలు సాధించి సత్తా చాటారు. పవర్ లిప్టింగ్, 100 మీటర్ల పరుగు పోటీల్లో బంగారు పతకాలు, డిస్కస్‌త్రో, జావలిన్ త్రోలో రజత పతకాలు కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా నాగజ్యోతిని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దుశ్శాలువా, పుష్పగుచ్ఛం, ప్రశంసాపత్రంతో అభినందించారు.
చదవండి: Venkata Krishna Reddy: ప్రణాళికతోనే పదిలో ఉత్తమ ఫలితాలు
ఖండాంతరాల్లో కూడా క్రీడల్లో సత్తా చూపి విద్యాశాఖ, రాష్ట్ర, దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని అభిలషించారు. నాగజ్యోతిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ఉపాధ్యాయులు క్రీడల్లో ప్రతిభ కనబరచాలని, విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాలవిద్య డైరెక్టర్ పి.పార్వతి, ఏపీ టెట్ జేడీ డాక్టర్ మేరీ చంద్రిక, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు.