Venkata Krishna Reddy: ప్రణాళికతోనే పదిలో ఉత్తమ ఫలితాలు
Sakshi Education
కడప ఎడ్యుకేషన్: పదో తరగతిలో ప్రణాళికతోనే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని పాఠశాల విద్య ఆర్‌జేడీ వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
అక్టోబర్ 16న కడప సీఎస్‌ఐ స్కూల్‌లోని డీసీఈబీ హాలులో జోన్–4 పరిధిలోని 8 జిల్లాలకు సంబంధించిన మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు 2023–24 పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్‌జేడీ మాట్లాడుతూ ఇటీవలే 116 మంది టీజీటీలకు పీజీటీలుగా పదోన్నతి కల్పించామన్నారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ముఖ్యమైన ప్రశ్నలు | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
వీరంతా తమకు కేటాయించిన పాఠశాలల్లో సహోపాధ్యాయులతో కలిసి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా సమన్వయంతో కృషి చేయాలన్నారు. సబ్జెక్టు వారీగా ప్రణాళిక ప్రకారం విద్యార్థులకు టైం టేబుల్ ఇవ్వాలని, దీనిని పాలించే విధంగా ప్రిన్సిపాళ్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని సూచించారు.
Published date : 18 Oct 2023 11:23AM