Osmania Medical College: ఉస్మానియా మెడికల్‌ కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు

సుల్తాన్‌బజార్‌: ఉస్మానియా మెడికల్‌ కళాశాలకు ‘ఐఎస్‌ఓ’ గుర్తింపు దక్కింది. గుర్తింపు పత్రాన్ని ఆగ‌స్టు 8న‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నరేంద్రకుమార్‌కు సంస్థ ప్రతినిధి శివయ్య అందజేశారు.

ఈ సందర్భంగా నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ.. ఉస్మానియా మెడికల్‌ కళాశాలకు రెండోసారి ఐఎస్‌ఓ గుర్తింపు దక్కడం గర్వకారణమన్నారు.

చదవండి: Govindarajan Padmanabhan: గోవిందరాజ‌న్‌కు తొలి ‘విజ్ఞాన్‌ రత్న’ అవార్డు

తమ కళాశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యాప్రమాణాలు, కళాశాలలోని పచ్చదనం, పర్యావరణం, మంచి బోధన, అన్ని స్థాయిల ఉద్యోగుల కృషితోనే ఈ గుర్తింపు లభించిందని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శంకర్‌, డాక్టర్‌ పద్మావతి, ఏడీ డాక్టర్‌ శ్రీధర్‌చారి తదితరులు పాల్గొన్నారు.

#Tags