‘Jyothishmathi’లో ఇంటింటా ఇన్నోవేషన్‌పై అవగాహన.. దరఖాస్తు విదానం ఇలా..
జిల్లా ఇన్నోవేషన్ కో–ఆర్డినేటర్ పి.మణిదీప్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నూతన ఆవి ష్కరణలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటింటా ఇన్నోవేటర్–2024లో కొత్త ఆవిష్కరణలు సామాజిక, వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడతాయ ని తెలిపారు.
విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చైర్మన్ సూచించారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ కేఎస్.రావు, అకాడమిక్ డీన్ వైశాలి, హెచ్‌వోడీలు, ఇన్‌స్టిట్యూట్ ఇన్నోవేషన్ ప్రెసిడెంట్ మణికండన్, కో–ఆర్డినేటర్ జగదీశన్, 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
చదవండి: CENS: బిట్స్ పిలానీలో ప్రారంభమైన సీఆర్‌ఈఎన్‌ఎస్
దరఖాస్తు ఇలా..
ఆవిష్కరణకు సంబంధించిన రెండు నిమిషాల వీడియో, 100 పదాల వివరణతోపాటు పేరు, గ్రామం, వయసు, వృత్తి, కళాశాల పేరు వివరాలను పంపాలి. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 10వ తేదీన ముగుస్తుంది. ఎంపికై న ఆవిష్కరణకు ఆగస్టు 15న సర్టిఫికెట్ ఇస్తారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీహబ్ ద్వారా ఇన్నోవేషన్‌కు పేటెంట్ దక్కుతుంది. ఇది స్కేలబుల్ అయితే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నుంచి నిధులు వస్తాయి.
Tags
- Jyothishmathi
- Innovation at Home
- District Sensitization Awareness Session
- Jyothishmathi Institute of Technology and Science
- Juvwadi Sagar Rao
- Juvwadi Sumit Sai
- Innovator at Home – 2024
- Telangana News
- Telangana State Innovation Cell
- thimmapur
- JyotishmatiInstitute
- AwarenessSession
- DistrictAwareness
- IntintaInnovation
- SakshiEducationUpdates