Skip to main content

Special leave for Girls: విద్యార్థినులకు ‘ప్రత్యేక’ సెలవు ఎందుకంటే..

School Girls Special leave news
School Girls Special leave news

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ (డీఎస్‌ఎన్‌ఎల్‌యూ) విద్యార్థినులకు నెలలో ఒక రోజు నెలసరి సెలవును ప్రకటించింది. కేవలం మెయిల్‌ ద్వారా ఈ ప్రత్యేక సెలవు తీసుకునే అవకాశం విద్యార్థినులకు కల్పించింది.

ప్రస్తుత (2024–25) విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. నెలసరి సమయాల్లో మహిళల్లో వచ్చే కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

Latest Anganwadi 9000 jobs news: Click Here

నెలసరి సమయాల్లో ఆరోగ్య సమస్యలతో విద్యార్థినులు కాలేజీకి వెళ్లడంలేదు. ప్రత్యేకంగా సెలవు కావాలంటే మెడికల్‌ సరి్టఫికెట్‌ సమర్పించాలి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సెలవు కోరుతూ యూనివర్సిటీ విద్యార్థినులు గత విద్యా సంవత్సరంలోనే రిజి్రస్టార్‌ ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. జనవరిలో ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 


దేశంలో 8 యూనివర్సిటీల్లో అమలు 
ఇప్పటికే దేశంలోని 7 యూనివర్సిటీల్లో ఈ విధానం అమల్లో ఉంది. రాయిపూర్‌లోని హిదయతుల్లా నేషనల్‌ లా యూనివర్సిటీ, ముంబై, ఔరంగాబాద్‌ల్లో ఉన్న మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీలు, భోపాల్‌లోని నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్సిటీ, జబల్‌పూర్‌లోని ధర్మశాస్త్ర నేషనల్‌ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని నల్సార్, అసోంలోని నేషనల్‌ లా యూనివర్సిటీ అండ్‌ జ్యుడిíÙయల్‌ అకాడమీల్లో ఈ వి«ధానం అమలవుతోంది. దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా వర్సిటీ ఎనిమిదోది.

Published date : 08 Aug 2024 09:18AM

Photo Stories