RDO Ratnakumari: విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
Sakshi Education
నిర్మల్ రూరల్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని చదవాలని ఆర్డీవో రత్నకుమారి సూచించారు.
మండలంలోని చిట్యాల ప్రభుత్వ పాఠశాలను ఆగస్టు 6న తనిఖీ చేశారు. తరగతులకు వెళ్లి విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు.
చదవండి: English Language Skills: ఇంగ్లిష్ భాషా సామర్థ్యాలు పెంచాలి
అనంతరం స్వచ్ఛదనం– పచ్చదనం కార్యక్రమంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంపీఈవో శ్రీనివాస్‌గౌడ్, ఇన్‌చార్జి హెచ్‌ఎం గజపల్లి నరసయ్య, ఉపాధ్యాయులు లక్ష్మీప్రసాద్ రెడ్డి, వహీద్, సంతోష్, షబ్బీర్ అలీ పాల్గొన్నారు.
Published date : 08 Aug 2024 10:35AM