Learning Skills: అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల నం.2లో ఆదిలాబాద్‌అర్బన్, మావల మండలాల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో ఆగస్టు 5న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలని సూచించారు.
నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని పేర్కొన్నారు. న్యాస్ పరీక్షల్లో జిల్లా ముందు వరుసలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. ఇందులో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు లచ్చిరాం, సెక్టోరియల్ అధికారి శ్రీకాంత్‌గౌడ్, ప్రధానోపాధ్యాయుడు సుధాకర్, రిసోర్స్ పర్సన్లు వెంకటేశ్, రాజేశ్వర్, అశ్విని తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Teachers Posts : ఉపాధ్యాయుల కొరతను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి.. ఉద్యోగ విరమణతో..
మధ్యాహ్న భోజనం పకడ్బందీగా అమలు చేయాలి
మధ్యాహ్న భోజనం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డీఈవో ప్రణీత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల నం.2ను ఆగస్టు 5న పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెడుతున్నారా.. లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వంట గదులతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులను ఆదేశించారు.