New PG Course: ‘నన్నయ’లో పీజీ కొత్త కోర్సు ప్రారంభం

రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఎంఎస్సీ జియోఇన్పర్మేటిక్స్‌ కోర్సును నూతనంగా ప్రారంభిస్తున్నారు.

కంప్యూటర్‌ సైన్స్, జియాలజీ, జియోగ్రఫ్రీ, లైఫ్‌ సైన్సెస్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్, అగ్రికల్చర్‌ సైన్సెస్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఎలక్రానిక్స్‌లలో ఏవైనా రెండు సబ్జెక్టులతో కోర్సు పూర్తి చేసిన సైన్స్‌ గ్రాడ్యుయేట్లు ఈ నూతన కోర్సులో చేరేందుకు అర్హులు.

ఏపీ పీజీ సెట్‌ ద్వారా మాత్రమే ఈ కోర్సులో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న వారు మే నెల 4వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో చేరిన విద్యార్థులకు స్కాలర్‌ షిప్, ఫెలోషిప్‌లు లభిస్తాయి. జియో ఇన్ఫర్మేటిక్స్‌ చేసిన విద్యార్థులకు పరిశోధనల్లోను, ఉద్యోగ, ఉపాధిలోను అవకాశాలు మెండుగా ఉంటాయి.

చదవండి: myCGHS App: ఈ యాప్‌ని విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

ఇస్రో, ఎన్‌.ఆర్‌.ఎస్‌.సి., ఎన్‌.బి.ఎస్‌.ఎస్‌., ఎస్‌.ఎస్‌.డి.ఐ., ఎఫ్‌.ఎస్‌.ఐ., జి.ఎస్‌.ఐ., డి.ఆర్‌.డి.ఓ., ఎన్‌.ఐ.ఆర్‌.డి. వంటి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. యాక్సెంచర్, భారతీ ఎయిర్‌టెల్, కాగ్నిజెంట్‌ టెక్నాలజీ, సైయింట్, జెనెసిస్‌ ఇంటర్నేషనల్, గూగుల్, ఇన్ఫోసిస్, బిపిఎం., టీసీఎస్‌., టెక్‌ మహేంద్రా, ట్రింబుల్‌ మ్యాప్‌లు, విప్రో వంటి సంస్థల్లోనూ ఉద్యోగాలు అందుకోవచ్చు.

అర్హత, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు  
‘నన్నయ’ వర్సిటీలో నూతనంగా ప్రారంభిస్తున్న ఎంఎస్సీ జియోఇన్ఫర్మేటిక్స్‌ కోర్సులో చేరేందుకు ఆసక్తి ఉన్న వారు శనివారంలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ పీజీ సెట్‌ రాసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కోర్సులో చేరిన విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫెలోషిప్‌లు లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలలో ఉద్యోగావకాశాలకు కొదవుండదు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని చూడవచ్చు. 
– ఉపకులపతి ఆచార్య కె.పద్మరాజు, ఆదికవి నన్నయ యూనివర్సిటీ 

#Tags