బంగారు భవిష్యత్‌కు NCC మార్గనిర్దేశం

గద్వాల: విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు ఎన్‌సీసీ మార్గనిర్దేశం చేయడంతో పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుందని జీహెచ్‌ఎం ఇమ్యాయేల్‌ పేర్కొన్నారు.

8వ తెలంగాణ బెటాలియన్‌ ఆధ్వర్యంలో 75వ ఎన్‌సీసీ దినోత్సవాన్ని న‌వంబ‌ర్‌ 25న‌ స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉన్నత ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఐక్యతే విజయాలకు బాట వేస్తుందన్నారు. అందుకే ఎన్‌సీసీ ఐక్యత, క్రమశిక్షణను నూరిపోస్తుందన్నారు. ఎన్‌సీసీ శిక్షణ పొందిన వారు ఏ రంగంలోనైనా రాణించగలుగుతారని పేర్కొన్నారు. ఎన్‌సీసీతో విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు దేశభక్తి, నాయకత్వ లక్షణాలు అలవడుతాయన్నారు.

చదవండి: NCC Training: శిక్షణతో పాటు సర్టిఫికెట్‌... ఉన్నత విద్య, ఉద్యోగాలలో ప్రత్యేక ప్రాధాన్యత!

గద్వాల ఎన్‌సీసీ శాఖ చక్కని పనితీరును కనబరుస్తూ విజయాలను సాధిస్తోందని కితాబిచ్చారు. అంతకు ముందు ఎన్‌సీసీ పతాకాన్ని ఆవిష్కరించి, విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ కేడెట్ల పరేడ్‌ ఆకట్టుకుంది.

కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారి సమరసింహారెడ్డి, ఉపాధ్యాయులు స్రవంతి, న్యాయవాది మధుసూదన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

#Tags