Navodaya Admission 2024: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

శ్రీకాకుళం న్యూకాలనీ: జవహర్‌ నవోదయ విద్యాలయం(జేఎన్‌వీ)లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్‌ వెలువడిందని.. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వెన్నెలవలస నవోదయ ప్రిన్సిపాల్‌ దాసరి పరశురామయ్య  ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Best School Award: ముచ్చటగా మూడోసారి..బెస్ట్‌ స్కూల్‌గా అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ పాఠశాల

జనవరి 18న జరిగే ఈ పరీక్షకు అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 16 లోపు http://navodaya.gov.inఅనే వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2013 మే 1 నుంచి 2015 జులై 31 మధ్య జన్మించినవారు అర్హులని స్పష్టంచేశారు. పూర్తి వివరాలకు జేఎన్‌వీ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

#Tags