Independence Day Quiz Competition 2023 : భార‌త 77వ స్వాతంత్య్ర దినోత్సవ సంద‌ర్భంగా.. ఉచితంగా క్విజ్, ఎస్సే, డ్రాయింగ్ పోటీలు.. విజేత‌ల‌కు న‌గ‌దు బ‌హుమతులు

సాక్షి ఎడ్యుకేష‌న్ : భార‌త్ 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్‌ ఆధ్వ‌ర్యంలో విద్యార్థుల కోసం ప్ర‌త్యేక‌ పోటీల‌ను నిర్వ‌హిస్తుంది.
Independence Day Quiz and Essay Competition 2023 Details

విద్యార్థులు క్విజ్, జనరల్ ఎస్సే, Art/ Drawing ల‌లో పాల్గొన‌వ‌చ్చును.

☛ క్విజ్ పోటీ : http://special.sakshi.com/independence_day_quiz/ ఈ లింక్ ద్వారా క్విజ్ పోటీలో పాల్గొనాలి. ఈ క్వీజ్‌లో పాల్గొనే అవ‌కాశం.. ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుంది.

☛ దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత 'టెక్నాల‌జీ' ఎలా అభివృద్ధి చెందింది? అనే అంశం పై ఒక జనరల్ ఎస్సేను, అలాగే Independenceకి సంబంధించిన‌ Art/ Drawing ని 9010050984 నెంబ‌ర్‌కు వాట్స‌ప్ (లేదా) sakshieduinfo@gmail.comకి పంపండి. ఈ జనరల్ ఎస్సే 400 నుంచి 600 పదాల మ‌ధ్య‌లో ఉండాలి. తెలుగు లేదా ఇంగ్లిష్ లో.. మీకు న‌చ్చిన భాష‌లో జనరల్ ఎస్సేను రాయ‌వ‌చ్చును. ఈ పోటీల‌కు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఇవి పూర్తి ఉచితంగా రాయ‌వ‌చ్చును.

మీరు జనరల్ ఎస్సే, Art/ Drawingని పంపాల్సిన చివ‌రి తేదీ ఆగ‌స్టు 15, 2023. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల‌కు న‌గ‌దు బ‌హుమ‌తులు ఇవ్వ‌బ‌డును. అలాగే పోటీలో పాల్గొన్న అంద‌రికి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. విజేత‌ల ఫోటోతో పాటు పేరుని కూడా www.sakshieducation.comలో ప్ర‌చురిస్తాము. ఇంకేందుకు ఆల‌స్యం ఇప్పుడే మీ తెలివికి ప‌దును పెట్టండి.. న‌గ‌దు బహుమ‌తి పొందండి. ఆల్ ది బెస్ట్..

#Tags