Good News: విద్యార్థుల ఇంటికే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు

సాక్షి, అమరావతి: ఏపీలో విద్యార్థులకు ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలను పొందడం మరింత సులభం కానుంది.
విద్యార్థుల ఇంటికే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు

ప్రస్తుతం గ్రామంలోని గ్రామ సచివాలయంలోనే వీటిని పొందుతుండగా.. ఇకపై ఈ మాత్రం కష్టం కూడా ఉండదు. దరఖాస్తు చేసుకోకపోయినా పది, ఇంటర్‌ చదివే విద్యార్థులకు వారి అర్హత, సామాజిక పరిస్థితి ఆధారంగా ఆదాయ, కుల ధృవీకరణ సరి్టఫికెట్లను ప్రభుత్వమే వారి ఇళ్లకు తీసుకొచ్చి అందజేయనుంది. అది కూడా ఉచితంగానే.. రెవెన్యూ శాఖ సూచన మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఈ ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టింది.

చదవండి: VP Gautham IAS: స్కూళ్లకే సర్టిఫికెట్లు

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో పది, ఇంటరీ్మడియట్‌ విద్యార్ధుల జాబితాలను రాష్ట్రంలో అన్ని సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోల మొబైల్‌ యాప్‌కు అనుసంధానం చేశారు. వీఆర్వోలు ఆ జాబితా ప్రకారం తమ పరిధిలోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితిని పరిశీలిస్తారు. దాని ఆధారంగా అర్హులందరికీ ఆదాయ, కుల ధృవీకరణ సరి్టఫికెట్ల జారీకి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ)కి నివేదిక ఇస్తారు.

చదవండి: ఏ ఎంపీకి చెందిన కుల ధ్రువీకరణ పత్రం రద్దయింది?

ఆర్‌ఐ పరిశీలన చేసి మండల తహసీల్దార్‌కు సిఫార్సు చేస్తారు. తహసీల్దార్‌ అర్హులకు సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఈ సరి్టఫికెట్లను సచివాలయాల వారీగా డౌన్‌లోడ్‌ చేస్తారు. వలంటీర్ల విద్యార్ధుల ఇళ్లకే వెళ్లి ఆ స ర్టిఫికెట్లను అందజేస్తారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ డిసెంబర్‌ 12లోగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనుంది. 

చదవండి: అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్

#Tags