Skip to main content

SEMS Olympiad Rankers : సెమ్స్ ఒలంపియాడ్‌లో విద్యార్థుల ప్ర‌తిభ‌.. రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించింది ఈ విద్యార్థిని..!

సెమ్స్‌ ఒలింపియాడ్‌లో పాఠ‌శాల విద్యార్థులు జాతీయ స్థాయిలో, రాష్ట్ర‌స్థాయిలోనూ ర్యాంకులు సాధించారని విద్యార్థుల‌ను అభినందించారు పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు..
School students talent in National and State level SEMS Olympiad 2024

సంతబొమ్మాళి: జాతీయ స్థాయి ప్రతిభా పరీక్షసెమ్స్‌ ఒలింపియాడ్‌ లో బోరుభద్ర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.రామకృష్ణ శుక్రవారం తెలిపారు. పాఠశాలకు చెందిన పట్నాన మృదుల రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించిందని పేర్కొన్నారు. అలాగే పాఠశాలకి చెందిన పొట్నూరు హరేంద్ర జోనల్‌ స్థాయిలో 5వ ర్యాంకు, జవ్వాది జాహ్నవి 9వ ర్యాంకు, సార ఇందు 16వ ర్యాంకు, మార్పు కీర్తిక 17వ ర్యాంకు సాధించినట్లు ఆయన తెలిపారు.

Selected Candidates : జాబ్ మేళాలో ఎంపికైన నిరుద్యోగులు..

విజేతలకు నగదు బహుమతులతో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు బహూకరిస్తారని సెమ్స్‌ ఒలింపియాడ్‌ సంస్థ నుంచి వర్తమానం వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను ఉపాధ్యాయులు టి.లోకేశ్వరరావు, డి.ఉమాశంకర్‌, ఎ.వెంకటరెడ్డి, కె.త్రినాథరావు, బాడాన రాజు, డి.ఉపాదేవి, కె.రమణమ్మ, టి.విజయలక్ష్మి, బి.నాగమణి, కె.విటిరెడ్డి, జి.జగదాంబ, బి.రజిని, బి.శ్రీనివాసరావు, పి.తిరుపతిరావు, ఎ.శంకరరావు, బి.కమలకుమారి, గోపాలరెడ్డి, సుశీలదేవి, కృ సాయిశివాని, త్రివేణి అభినందించారు.

Jobs In Drogo Drones Private Limited: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డ్రోన్‌ పైలెట్‌గా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

Published date : 24 Jun 2024 08:51AM

Photo Stories