ఏ ఎంపీకి చెందిన కుల ధ్రువీకరణ పత్రం రద్దయింది?
Sakshi Education
మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ రాణా కుల ధ్రువీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు జూన్ 8న రద్దు చేసింది.
ఆమె తప్పుడు పత్రాలు సమర్పించి, మోసపూరితంగా కుల ధ్రువీకరణ పత్రం పొందారంది. 6వారాల్లోగా దాన్ని సరెండర్ చేయాలని ఆదేశించింది. రూ.2 లక్షల జరిమానా విధించింది. చర్మకారులైన ‘మోచీ’ కులానికి చెందిన మహిళనంటూ నవనీత్ షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) సర్టిఫికెట్ పొందారని కోర్టు పేర్కొంది. నవనీర్ కౌర్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ రాణా కుల ధ్రువీకరణ పత్రం రద్దు
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : బాంబే హైకోర్టు
ఎందుకు : ఆమె తప్పుడు పత్రాలు సమర్పించి, మోసపూరితంగా కుల ధ్రువీకరణ పత్రం పొందారని...

Published date : 09 Jun 2021 07:42PM