ద్రవిడ వర్సిటీలో రిటైర్డ్ జడ్జితో విచారణ
కుప్పం(చిత్తూరు జిల్లా): ద్రవిడ వర్సిటీలో పీహెచ్‌డీ కోర్సుల వ్యవహారంపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి.శేషశయనారెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోర్సుల ప్రారంభం నుంచి జరిగిన సర్టిఫికెట్ల అవకతవకల వ్యవహారంపై ఆయన విచారణ చేశారు. వర్సిటీలో గతంలో పనిచేసిన వైస్ చాన్సలర్లను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24న వర్సిటీలో గతంలో వీసీగా పనిచేసిన ఈడీ లక్ష్మీనారాయణ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం పీహెచ్‌డీ కోర్సులు నిలిపివేయడంతో కొందరు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. పదేళ్ల నుంచి ద్రవిడ వర్సిటీలో పీహెచ్‌డీ సర్టిఫికెట్ల వ్యవహారం వివాదాస్పదంగా నడుస్తోంది.
చదవండి:
#Tags