దూరవిద్య ద్వారా లైబ్రరీ సైన్స్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
మలక్‌పేట: కుప్పం ద్రవిడ యూనివర్సిటీ దూర విద్యావిధానం ద్వారా లైబ్రరీ సైన్స్
కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దిల్‌సుఖ్‌నగర్ మేఘన అకాడమి ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కరస్పాండెంట్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ కోర్సులతో పాటు బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, సైన్‌స కోర్సులకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఇంటర్ పాసైన వారు నేరుగా డిగ్రీలో చేరవచ్చని, 18 సంవత్సరాలు, ఆపై వయస్సు కలిగిన అభ్యర్థులు ఏవిధమైన విద్యార్హతలు లేకపోయినా ప్రవేశపరీక్ష ద్వారా డిగ్రీలో, డిగ్రీ పాసైన అభ్యర్థులు పీజీలో అడ్మిషన్ పొందడానికి వీలుందన్నారు. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు16వ తేదిలోగా కళాశాలలోని యూనివర్సిటీ ఆథరైజ్డ్ సెంటర్‌లో సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు: 81251 50999, 96409 36555.
Published date : 07 Aug 2017 01:06PM