SAFE 2024: ‘సేఫ్‌–2024’కు విశేష స్పందన.. 500 మందికి ప్రి అప్రూవల్‌ లెటర్లు

సాక్షి,సిటీబ్యూరో: విదేశీ విద్యాభ్యాసం, ఉన్నత చదువుల నిమిత్తం విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లు, విద్యా రుణాలు అందజేసేందుకు గాను ‘వీ మేక్‌ స్కాలర్‌ షిప్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్టడీ అబ్రాడ్‌ ఫండింగ్‌ ఎక్స్‌ పో (సేఫ్‌) 2024 కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

మార్చి 3న‌ బేగంపేట్‌ ఓల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులోని మనోహర్‌ హోటల్‌లో దేశంలోనే అతి పెద్దదైన ఎడ్యుకేషన్‌ ఫైనాన్స్‌ ఫ్లాట్‌ ఫాంను నిర్వహించారు. ఈ సందర్భంగా ‘వీ మేక్‌ స్కాలర్‌ షిప్‌’ కో ఫౌండర్‌, సీఈఓ దామిని మహాజన్‌, సీఎంఓ అర్జున్‌ ఆర్‌ కృష్ణ మాట్లాడుతూ ఐటీ మంత్రిత్వ శాఖ, డిజిటల్‌ ఇండియా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.

చదవండి: US Student Visa New Rules: దరఖాస్తులో ఈ కొత్త నిబంధనలు తెలుసుకోకపోతే... వీసా ఫీ కూడా వెనక్కి రాదు!!

ఈ కార్యక్రమానికి వెయ్యి మందికి పైగా విద్యార్థులు హాజరుకాగా దాదాపు 500 మందికి ప్రి అప్రూవల్‌ లెటర్లు అందజేశామన్నారు. ‘వీ మేక్‌ స్కాలర్‌ షిప్‌’ ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 26 వేల మంది విద్యార్థులకు పైగా ఉపకార వేతనాలు, తక్షణ రుణ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులకు అతి తక్కువ వడ్డీ రేటుతో ప్రీ అప్రూవల్‌ లెటర్‌ అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

చదవండి: Fulbright Fellowship Applications- అమెరికాలో చదువుకోవాలనుకుంటున్నారా? ఈ స్కాలర్‌షిప్‌ గురించి తెలుసా?

#Tags