Skip to main content

Fulbright Fellowship Applications- అమెరికాలో చదువుకోవాలనుకుంటున్నారా? ఈ స్కాలర్‌షిప్‌ గురించి తెలుసా?

Fulbright Fellowship Applications

ఫుల్‌బ్రైట్-నెహ్రూ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోషిప్ 2025-2026 విద్యా సంవత్సరానికి  గాను భారతీయ విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అసలు ఏంటీ ఫుల్‌బ్రైట్‌ ఫెలోషిప్‌ తెలుసుకోవాలంటే.. ఈ  స్టోరీ చదివేయండి. 

 

అలాంటి వాళ్లకోసమే స్కాలర్‌షిప్స్‌
విదేశీ యూనివర్సిటీల్లో చదువుకోవాలని కోరుకుంటున్న విద్యార్థులకు భారీ ఫీజులు, వ్యయాలు ప్రధాన అవరోధంగా మారుతున్నాయి. దీంతో ఎంతోమంది అవకాశాలు వచ్చినా వదులుకుంటున్న పరిస్థితి. ఇలాంటి విద్యార్థులకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పిస్తూ పలు స్కాలర్‌ఫిప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ఇండియాతో పాటు చాలా దేశాల విద్యార్థులు  అమెరికాను బెస్ట్ ఆప్షన్‌గా సెలక్ట్ చేసుకుంటారు.

ప్రతిష్టాత్మకమైన స్కాలర్‌షిప్ 

ప్రతిష్టాత్మక కాలేజీల్లో చదవాలనే కోరికతో ఏటా వేలాది మంది విద్యార్థులు యూనివర్సిటీల్లో అప్లై చేస్తుంటారు. ఇలాంటి విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పిస్తున్నాయి .అమెరికాలో ఎలాంటి కోర్సులో చేరాలనుకున్న వారికైనా.. అందుబాటులో ఉన్న ఉపకార వేతనం.. ఫుల్‌బ్రైట్‌ స్కాలర్‌షిప్స్‌.ఇది ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌, కల్చరల్ ఎక్స్ఛేంజ్‌కి ప్రతిష్టాత్మకమైన స్కాలర్‌షిప్. భారతదేశం సహా 160 దేశాలకు చెందిన విద్యార్థులకు, స్కాలర్స్‌కు స్కాలర్‌షిప్‌లు అందిస్తుంది.

వారు ఈ ఫెలోషిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు

ఆర్ట్స్, ఎకనామిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/స్టడీస్, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నేషనల్‌ అఫైర్స్, ఇంటర్నేషనల్‌ లీగల్‌ స్టడీస్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్‌ హెల్త్, అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్, ఉమెన్స్‌ స్టడీస్‌/జండర్‌ స్టడీస్‌ తదితర విభాగాల్లో పీజీ, ఆపై స్థాయి కోర్సుల్లో చేరిన వారు ఈ ఫెలోషిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారికి కోర్సు వ్యవధిలో ఒకసారి స్వదేశానికి వచ్చి వెళ్లేందుకు విమాన చార్జీలు, నివాస ఖర్చులు, ట్యూషన్‌ ఫీజు ఫండింగ్‌ వంటివి లభిస్తాయి. 

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ fulbrightscholars.orgలో అప్లై చేసుకోవచ్చు. 

“ఫుల్‌బ్రైట్-నెహ్రూ స్కాలర్‌షిప్ నా జీవితాన్ని మార్చేసింది. ఈ ఫెలోషిప్‌ నాకు విస్తృతమైన అవకాశాలను అందించింది. ఈ రోజు, నేను బ్లూమ్‌బెర్గ్ స్కూల్‌లో ఆసియా పసిఫిక్ పబ్లిక్ హెల్త్ నెట్‌వర్క్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని గర్వంగా చెబుతున్నాను.''
- నవీన్ అనశ్వర, 2023-2024 జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో ఫుల్‌బ్రైట్-నెహ్రూ మాస్టర్స్ ఫెలో

Published date : 06 Feb 2024 03:23PM

Photo Stories