గుంటూరు వైద్య కళాశాలకు పీజీ సీట్లు మంజూరు

గుంటూరు మెడికల్‌: గుంటూరు వైద్య కళాశాలకు 22 పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు మర్చి 14న నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నుంచి ఉత్తర్వులు అందాయి.
గుంటూరు వైద్య కళాశాలకు పీజీ సీట్లు మంజూరు

గుంటూరు వైద్య కళాశాలలోని పలు విభాగాల్లో పీజీ సీట్ల పెంపుపై పరిశీలన కోసం ఫిబ్రవరి 21వ తేదీన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ అధికారులు తనిఖీలు చేశారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిబంధనల మేరకు కళాశాలలో వసతులు ఉండటంపై తనిఖీ అధికారులు సంతృప్తి వ్యక్తంచేశారు. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం పెథాలజీ విభాగంలో ఐదు, జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో 13, ఎమర్జెన్సీ మెడిసిన్‌ విభాగంలో నాలుగు పీజీ సీట్లను మంజూరు చేస్తూ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు మెడికల్‌ కాలేజీకి గత విద్యా సంవత్సరంలో ఒకేసారి 40 పీజీ సీట్లు మంజూరు కాగా, ఇప్పుడు 22 సీట్లు మంజూరుకావడంపై వైద్య కళాశాల అధికారులు, బోధనా సిబ్బంది ఆనందం వ్యక్తంచేశారు. 

చదవండి:

NMC: ఈ కాలేజీలపై ఢిల్లీ నుంచి నిఘా

స్టాఫ్‌నర్స్‌ దరఖాస్తులకు ఎడిట్‌ ఆప్షన్‌

Medical and Health Department: గ్రామీణ సేవల్లో పీజీ వైద్య విద్యార్థులు

#Tags