Admissions 2024: ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశానికి గడువు పెంపు

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశానికి గడువు పెంపు
Admissions 2024: ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశానికి గడువు పెంపు

నంద్యాల: 2024–25 విద్యా సంవత్సరానికి ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 1వ తరగతిలో 25 శాతం సీట్లలో ఉచితంగా ప్రవేశాలకు ఈనెల 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ సుధాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీ వరకు ఉన్న గడువును ప్రభుత్వం పొడిగించిందన్నారు. విద్యార్థుల నివాసానికి సమీపంలో ఉన్న ఐబీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌ అందిస్తున్న అన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలో ప్రవేశం పొందవచ్చని వివరించారు. ఆసక్తి గల వారు https://cse.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రు లు గ్రామ సచివాలయం/ ఎంఆర్‌సీ సెంటర్‌/ఎంఈఓ ఆఫీస్‌, సంబంధిత పాఠశాల నుంచే దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అర్హులై న విద్యార్థులకు లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. వివరాలకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004258599కి ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.

#Tags