Free Employment Training: మహిళలకు ఉపాధి శిక్షణ

రామగిరి(మంథని): సింగరేణి పరిసర ప్రాంత మ హిళల కోసం చేపట్టిన ఉపాధి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఏ, ఆర్జీ–3 ఇన్‌చా ర్జి జీఎంలు వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ తెలిపారు.

స్థానిక ఎంవీటీసీలో సీఎస్‌ఆర్‌ నిధులతో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన మగ్గం డిజైనింగ్‌, టె క్స్‌టైల్‌ ఫ్యాబ్రిక్‌ డైయింగ్‌ ఉచిత ఉపాధి శిక్షణ తరగతులను ఫిబ్ర‌వ‌రి 12న‌ ప్రారంభించి మాట్లాడారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి సింగరేణి విరివిగా నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. వాటితో పర్యావరణ హిత, సామాజిక, ఉపాధి శిక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు.

చదవండి: Unemployment Rate: తగ్గిన నిరుద్యోగిత రేటు.. క్యూ3 బులిటెన్ విడుదల

అనంతరం శిక్షణకు హాజరయ్యే మహిళలకు మగ్గం వర్క్‌ డిజైనింగ్‌, టెక్స్‌టైల్‌ డైయింగ్‌ పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం బైద్య, యూనియన్‌ నాయకులు ఎంఆర్‌సీ రెడ్డి, కొట రవీందర్‌రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఎ.శ్రీనివాస్‌, వై.వెంకన్న, వినోద్‌కుమార్‌, పర్సనల్‌ మేనేజర్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

#Tags