Unemployment Rate: తగ్గిన నిరుద్యోగిత రేటు.. క్యూ3 బులిటెన్ విడుదల
Sakshi Education
దేశీయంగా పట్టణ ప్రాంతాల్లో 2023 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 15 ఏళ్లకు పైబడిన వారిలో నిరుద్యోగిత రేటు 6.5 శాతానికి తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో రేటు 7.2 శాతంగా నమోదైంది.
కార్మిక శక్తి సర్వేకు (పీఎల్‌ఎఫ్‌ఎస్) సంబంధించి ప్రభుత్వం ఫిబ్రవరి 12వ తేదీ విడుదల చేసిన త్రైమాసిక బులెటిన్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘2022 అక్టోబర్–డిసెంబర్‌లో పురుషుల్లో నిరుద్యోగిత రేటు 6.5 శాతంగా ఉండగా 2023 డిసెంబర్ త్రైమాసికంలో 5.8 శాతానికి తగ్గింది. మహిళలలో ఇది 9.6 శాతం నుంచి 8.6 శాతానికి దిగి వచ్చిందని బులెటిన్ పేర్కొంది.
ఇక పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు పైబడిన వర్కర్ల జనాభా నిష్పత్తి 44.7 శాతం నుంచి 46.6 శాతానికి పెరిగినట్లు వివరించింది. పురుషుల్లో ఇది 68.6 శాతం నుంచి 69.8 శాతానికి మహిళల్లో 20.2 శాతం నుంచి 22.9 శాతానికి పెరిగింది. ఎప్పటికప్పుడు కార్మిక శక్తి వివరాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2017లో పీఎల్‌ఎఫ్‌ఎస్‌ను ప్రారంభించింది.
EPF Interest Rate: ఉద్యోగులకు శుభవార్త.. ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంపు..
Published date : 13 Feb 2024 12:52PM