EPF Interest Rate: ఉద్యోగులకు శుభవార్త.. ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంపు..
2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.25 శాతానికి పెరిగింది. ఫిబ్రవరి 10వ తేదీ జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌వో వర్గాలు వెల్లడించాయి. గత మూడు సంవత్సరాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
ఈ సీబీటీ నిర్ణయాన్ని త్వరలోనే కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేయనుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ ఆరు కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేయనుంది. 2022-23లో వడ్డీ రేటును 8.15 శాతంగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.10 శాతంగా నిర్ణయించారు.
గత పదేళ్లలో ఈపీఎఫ్ వడ్డీ రేట్లు..
2013-14 : 8.75 శాతం
2014-15 : 8.75 శాతం
2015-16 : 8.8 శాతం
2016-17 : 8.65 శాతం
2017-18 : 8.55 శాతం
2018-19 : 8.65 శాతం
2019-20 : 8.5 శాతం
2020-21 : 8.5 శాతం
2021-22 : 8.1 శాతం
2022-23 : 8.15 శాతం