ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

కృష్ణలంక(విజయవాడతూర్పు): పార్ట్‌ టైం ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ టి.కల్పలతారెడ్డి అన్నారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఏపీ వర్క్‌, ఆర్ట్‌, వ్యాయామ ఉపాధ్యాయ ఇన్‌స్ట్రక్టర్స్‌ యూనిటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జూలై 23న‌ రాష్ట్ర స్థాయి సమగ్ర శిక్ష పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్ల అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కల్పలతారెడ్డి దృష్టికి పార్ట్‌ టైం ఉపాధ్యాయులు తమ సమస్యలు తీసుకెళ్లారు. అందుకు ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించి వేతనం పెరుగుదల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

చదవండి: Government teachers: టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనను తిలకించి పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్ల ప్రతిభను ప్రశంసించారు. ఏపీ వర్క్‌, ఆర్ట్‌, వ్యాయామ ఉపాధ్యాయ ఇన్‌స్ట్రక్టర్స్‌ యూనిటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్‌.శివకుమారి రెడ్డి, ఎంఈవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరత్నం, వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి, డెమొక్రటిక్‌ పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి​​​​​​​

#Tags