Admissions: మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల వివరాలు.. ఇన్ని లక్షల ర్యాంకు దాటినా.. కన్వీనర్‌ సీటు

సాక్షి, హైదరాబాద్‌: నీట్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఇక త్వరలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర వైద్య కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల వివరాలు.. ఇన్ని లక్షల ర్యాంకు దాటినా.. కన్వీనర్‌ సీటు

ఈ నేపథ్యంలో ఎంత ర్యాంకుకు ఎంబీబీఎస్‌లో కన్వీనర్‌ కోటాలో సీటు వస్తుందన్న దానిపై విద్యార్థుల్లో చర్చ జరుగుతోంది. పైగా గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీలో 9 కొత్తగా వస్తున్నాయి. అంటే 900 ఎంబీబీఎస్‌ సీట్లు పెరుగుతాయి. అలాగే కొన్ని ప్రైవేట్‌ కాలేజీల్లోనూ సీట్లు పెరుగుతాయి. గతేడాది లెక్క ప్రకారం చూసినా 2 లక్షల ర్యాంకు దాటినా రిజర్వు కేటగిరీలో సీటు వచ్చే అవకాశముంది. అలాగే అన్‌ రిజర్వుడు కేటగిరీలోనూ 1.25 లక్షల ర్యాంకుకూ కన్వీనర్‌ సీటు వచ్చే అవకాశం ఉంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిపుణుల అంచనా ప్రకారం జాతీయస్థాయిలో రెండు లక్షలకుపైగా ర్యాంకులు వచ్చి న వారికి కూడా కన్వీనర్‌ కోటాలో సీ ట్లు వస్తాయని చెబుతున్నారు. అలాగే జాతీయ స్థాయిలో 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ర్యాంకులు వచ్చిన వారి కి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లోనూ బీ కేటగిరీలో ఎంబీబీఎస్‌ సీటు వస్తుందని అంటున్నారు.  

చదవండి: MBBS: ఎంబీబీఎస్‌కు తొమ్మిదేళ్లే చాన్స్‌... ఒక్క ప‌రీక్ష ఫెయిలైనా మ‌ళ్లీ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో కూర్చోవాల్సిందే..!

రాష్ట్రంలోని 56 మెడికల్‌ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్‌ సీట్లు 

రాష్ట్రంలో 2023–24 వైద్య విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయని జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ప్రకటించింది. 27 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. మంగళవారం ‘నీట్‌’ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో సీట్లపై స్పష్టత వచ్చింది. ఇక నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నుంచి నీట్‌లో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ జారీచేస్తామని విశ్వవిద్యాలయం వెల్లడించింది. ‘నీట్‌’ర్యాంకుల ప్రకటన అనంతరం రాష్ట్రస్థాయిలో తమకెంత ర్యాంకు వస్తుందోనన్న ఆసక్తి, ఆందోళన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. 

చదవండి: National Medical Commission: ఎన్‌ఎంసీ తీరు మారాలి

15 శాతం సీట్లు అఖిల భారత కోటాకు కేటాయింపు... 

ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు సీట్ల కేటాయింపు జరిగింది. 

చదవండి: Harish Rao: రాష్ట్రంలో 13 మెడికల్‌ కాలేజీలకు ఎన్‌ఎంసీ అనుమతి

గతేడాది రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో కన్వీనర్‌ కోటాలో ఎంత ర్యాంకుకు సీటు వచ్చిందంటే... 

కేటగిరీ

గరిష్ట ర్యాంకు

జనరల్‌

125070

ఎస్సీ

210919

ఎస్టీ

207157

బీసీ ఏ

228059

బీసీ బీ

137970

బీసీ సీ

198227

బీసీ డీ

128729

బీసీ ఈ

143603

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల వివరాలు

మెడికల్‌ కాలేజీ పేరు

సీట్లు

1) ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌

250

2) గాంధీ మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌

250

3) కాకతీయ మెడికల్‌ కాలేజీ, వరంగల్‌

250

4) మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీ

175

5) నల్లగొండ మెడికల్‌ కాలేజీ

150

6) నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ

120

7) సిద్దిపేట మెడికల్‌ కాలేజీ

175

8) సూర్యాపేట మెడికల్‌ కాలేజీ

150

9) రాజీవ్‌గాంధీ మెడికల్‌ కాలేజీ, ఆదిలాబాద్‌

120

10) రాజన్న సిరిసిల్ల మెడికల్‌ కాలేజీ

100

11) నిర్మల్‌ మెడికల్‌ కాలేజీ

100

12) ఖమ్మం మెడికల్‌ కాలేజీ

100

13) జనగాం మెడికల్‌ కాలేజీ

100

14) వికారాబాద్‌ మెడికల్‌ కాలేజీ

100

15) జయశంకర్‌ భూపాలపల్లి మెడికల్‌ కాలేజీ

100

16) కామారెడ్డి మెడికల్‌ కాలేజీ

100

17) కొమురంభీం ఆసిఫాబాద్‌ మెడికల్‌ కాలేజీ

100

18) మంచిర్యాల మెడికల్‌ కాలేజీ

100

19) రామగుండం మెడికల్‌ కాలేజీ

150 

20) జగిత్యాల మెడికల్‌ కాలేజీ

150

21) మహబూబాబాద్‌ మెడికల్‌ కాలేజీ

150

22) భద్రాద్రి కొత్తగూడెం మెడికల్‌ కాలేజీ

150

23) నాగర్‌కర్నూలు మెడికల్‌ కాలేజీ

150

24) వనపర్తి మెడికల్‌ కాలేజీ

150

25) సంగారెడ్డి మెడికల్‌ కాలేజీ

150 

26) కరీంనగర్‌ మెడికల్‌ కాలేజీ

100

27) ఈఎస్‌ఐసీ, హైదరాబాద్‌

100

మొత్తం

3,790

ప్రైవేటు, మైనారిటీ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల వివరాలు

మెడికల్‌ కాలేజీ పేరు

సీట్లు

1) అపోలో, హైదరాబాద్‌

150

2) అయాన్, రంగారెడ్డి జిల్లా

150

3) భాస్కర్‌ మెడికల్‌ కాలేజీ, ఎంకపల్లి

150

4) చల్మెడ ఆనందరావు మెడికల్‌ కాలేజీ, కరీంనగర్‌

200

5) డెక్కన్‌ మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌

150

6) డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్‌ కాలేజీ, చేవెళ్ల

150

7) డాక్టర్‌ వీఆర్‌కే ఉమెన్స్‌ మెడికల్‌ కాలేజీ, అజీజ్‌నగర్‌

100

8) కామినేని అకాడమీ, హైదరాబాద్‌

150

9) కామినేని మెడికల్‌ కాలేజీ, నార్కట్‌పల్లి

200

10) మహవీర్‌ మెడికల్‌ కాలేజీ, వికారాబాద్‌

150

11) మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌

200

12) మల్లారెడ్డి ఉమెన్స్‌ మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌

200

13) మమత మెడికల్‌ కాలేజీ, బాచుపల్లి

150

14) మమత మెడికల్‌ కాలేజీ, ఖమ్మం

200

15) మెడిసిటీ మెడికల్‌ కాలేజీ, ఘన్‌పూర్‌

150

16) ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ, సంగారెడ్డి

150

17) ప్రతిమ మెడికల్‌ కాలేజీ, కరీంనగర్‌

200

18) ఆర్వీఎం మెడికల్‌ కాలేజీ, మెదక్‌

150

19) షాదన్‌ మెడికల్‌ కాలేజీ, పటాన్‌చెరు

150

20) సురభి మెడికల్‌ కాలేజీ, సిద్దిపేట

150

21) ఎస్వీఎస్‌ మెడికల్‌ కాలేజీ, మహబూబ్‌నగర్‌

150

22) మహేశ్వర మెడికల్‌ కాలేజీ, మెదక్‌

150

23) నీలిమ మెడికల్‌ కాలేజీ, మేడ్చల్‌

150

24) సీఎంఆర్‌ మెడికల్‌ కాలేజీ

150

25) ఫాదర్‌ కొలంబో మెడికల్‌ కాలేజీ, వరంగల్‌

150

26) అరుంధతి మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌

150

27) టీఆర్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ, పటాన్‌చెరు

150

28) ఆర్వీఎం మెడికల్‌ కాలేజీ, సిద్దిపేట

250

29) ప్రతిమ రిలీఫ్‌ కాలేజీ, వరంగల్‌

150

మొత్తం

4,700

#Tags