Daughter of IPS Officer Sumathi: టీసీఎస్‌ ఐయాన్‌ ఇంటెలిజెమ్‌ రన్నరప్‌గా సంస్కృతి

సాక్షి ఎడ్యుకేషన్: జాతీయ స్థాయి టీసీఎస్‌ ఐయాన్‌ ఇంటెలిజెమ్‌ గ్రాండ్‌ ఫినాలేలో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన సంస్కృతి రన్నరప్‌గా నిలిచింది.

ఏడో తరగతి చదువుతున్న సంస్కృతి సీనియర్‌ విభాగంలో ‘యూనివర్సల్‌ వాల్యూస్‌’, ‘ఫైనాన్షియల్‌ లిటరసీ’ అంశాల్లో రన్నరప్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గత ఆరు ఎడిషన్‌లలో హెచ్‌పీఎస్‌ నుంచి దీనిని సాధించిన ఏకైక విద్యార్ధి సంస్కృతి కావడం విశేషం. ఈ ఎడిషన్‌లో జూనియర్‌ విభాగంలో హెచ్‌పీఎస్‌ నుంచి మరో ఇద్దరు విద్యార్థులు ఫైనల్‌కు చేరుకున్నారు.

టీసీఎస్‌ ఐయాన్‌ ఇంటెలిజెమ్‌ అనేది 21వ శతాబ్దపు నైపుణ్యాల కోసం 5 నుంచి 9వ తరగతుల విద్యార్థుల కోసం మూడు దశల్లో నిర్వహించే అతిపెద్ద జూతీయ స్థాయి పోటీ. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా  వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఐదు కేటగిరీల్లో 48 మంది విద్యార్థులు మాత్రమే ఫైనల్‌కు చేరుకున్నారు. సంస్కృతి పాల్గొన్న నాలుగు విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకుంది. రెండు విభాగాల్లో టాప్‌–2లో నిలిచింది. కాగా సంస్కృతి ఐపీఎస్‌ ఆఫీసర్‌ సుమతి కుమార్తె.  

చదవండి: Success Story : రూ.50వేలు తీసుకుని హైదరాబాద్‌కు వచ్చా.. గ్రూప్‌–1 కొట్టా..

#Tags