Challa Srilata Reddy: మహిళల్లో న్యాయ చైతన్యం తెస్తా

నాలో లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌ స్కూలు నుంచే మొదలయ్యాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో అబుదాబిలో ఉన్న నేను రాష్ట్రంగా ఏర్పడాల్సిన అవసరాన్ని తెలియజేయడానికి అక్కడ అనేక సమావేశాలు ఏర్పాటు చేశాను.

ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం వెనుక ఉద్దేశం మహిళలు... అవినీతి, వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి పరిపాలన అందించగలుగుతారనే నమ్మకమే. దేశం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ సమాజంలో మహిళల మీద దాడులు తగ్గడం లేదు. ఆ విషయంలో మహిళల్లో చైతన్యం తీసుకురావాలి.

చదవండి: TS Elections 2023: ఎన్నికల బరిలో ఇంత‌ మంది అభ్యర్థులు.. నియోజకవర్గాల వారీగా వివరాలివీ..

నేను ఎల్‌ఎల్‌బీ చేసింది కూడా మహిళల్లో న్యాయపరమైన చైత్యనం తీసుకురావడం కోసమే. ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం చట్టసభలో పోరాడడానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. 
– చల్లా శ్రీలతారెడ్డి, ఎం.ఏ., ఎల్‌ఎల్‌బీ, హుజూర్‌నగర్, బీజేపీ

#Tags