Biology teacher: ఆయనో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు.. విద్యార్థులకు సులభ పద్ధతిలో పాఠాలు

నిర్మల్‌ఖిల్లా: ఆయనో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు.. విద్యార్థులకు సులభ పద్ధతిలో పాఠాలు బోధించనిదే తనకు సంతృప్తి ఉండదంటారు. అతనే నిర్మ ల్‌ జిల్లా కేంద్రానికి చెందిన మైస అరవింద్‌. లక్ష్మణ చాంద మండలం వడ్యాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా రు. సాంకేతికతను అందిపుచ్చుకుని డిజిటల్‌ పా ఠాలు, ప్రొజెక్టర్‌పై బోధనోపకరణాలతో విద్యాబో ధన చేస్తున్నారు. విద్యార్థులు ఆసక్తిగా వింటున్నా రు. ప్రతీ బోధనాంశాలను వీడియో తీస్తున్నారు. వారి కోసం అరవింద్‌ మైస వ్లాగ్స్‌ (Aravind mysa vlogs) పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి అప్‌లోడ్‌ చేస్తున్నారు. దేశ విదేశాల్లో విద్యార్థులు, వీక్షకులు చూసి లైక్‌లు టిక్‌ చేసి, కామెంట్లు పెడుతున్నారు.

లక్షకు పైగా సబ్‌స్కైబర్స్‌
పదో తరగతి విద్యార్థులకు సలహాలు సూచనలు, ఉన్నత విద్యాభ్యాసం, భవిష్యత్‌ మార్గసూచి, కెరీర్‌ గైడెన్స్‌, సమాజంలోని వివిధ వృత్తులు వ్యవసాయ, అనుబంధ రంగాలు తదితర అంశాలపై వీడియో తీసి ‘అరవింద్‌ మైస వ్లాగ్స్‌కు అప్‌లోడ్‌ చేస్తున్నారు. వీటిని కోటికిపైగా వీక్షించారు. ఇతరులకు షేర్‌ చేస్తూ ఉంటారు. ఇప్పటికే ‘లక్ష’కుపై సబ్‌స్కైబర్లుగా ఉండడం విశేషం.

TS Schools Timings Changes Due Rain : బ్రేకింగ్ న్యూస్‌.. భారీ వర్షాలు..విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్స్ ఈ స‌మ‌యంలోనే.. అలాగే సెల‌వులు ఇచ్చే అవ‌కాశం..?

వీడియోలకు క్రేజ్‌
ఇప్పటికే డీఈవో, జిల్లా కలెక్టర్‌, సబ్జెక్టు నిపుణులతో తన వీడియోలో పరిచయ కార్యక్రమాలు, సందేశాలను ఇవ్వడంతో అరవింద్‌ వీడియోలకు క్రేజ్‌ పెరిగింది. ఇతర దేశాల నుంచి వీక్షకులు ఉన్నారు. ఇప్పటికే ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు, సన్మానాలు, ప్రశంసపత్రాలు అందుకున్నారు.

#Tags