K Haribabu: ఏయూ విజయాలు ప్రశంసనీయం

ఏయూ క్యాంపస్‌ : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇటీవల సాధించిన పలు విజయాలు తనకు అమితమైన సంతోషాన్ని కలిగిస్తున్నాయని ఏయూ పూర్వ విద్యార్థి, పూర్వ ఆచార్యుడు, మిజోరాం రాష్ట్ర గవర్నర్‌ కె.హరిబాబు అన్నారు.

న‌వంబ‌ర్‌ 22న‌ ఆయన ఏయూలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఏయూ ఒడిలో రాజకీయ ఓనమాలు నేర్చుకుని, జగదాంబ వీధుల్లో ఉద్యమ శ్వాసను పీల్చుకున్నానన్నారు. నాక్‌లో ఏయూ డబుల్‌ ప్లస్‌ సాధించడం పట్ల ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డిని అభినందించారు.

చదవండి: Library: జగనన్న హయాంలో ఆధునికంగా గ్రంథాలయ వ్యవస్థ

నూతన విద్యా విధానం 2020ని ఏయూలో పూర్తిస్థాయిలో అమలుపై హర్షం వ్యక్తం చేశారు. యువత ఆలోచనలకు రూపం కల్పించే వేదికగా ఆ హబ్‌ నిలుస్తోందన్నారు. ప్రతి సాంకేతిక విద్యా సంస్థ ఒక నైపుణ్య శిక్షణ కేంద్రంగా నిలుస్తూ స్టార్టప్‌ వ్యవస్థను కలిగి ఉండాలని సూచించారు. ఆ హబ్‌ను సందర్శించి, వివరాలు తెలుసుకుని, యువతతో మాట్లాడారు. ఏయూ నుంచి యూనికాన్‌లు ఆవిర్భవించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ఏయూ వీసీ ప్రసాదరెడ్డి స్వయంగా హరిబాబుకు ఏయూ ఇంక్యుబేషన్‌ స్టార్టప్‌ కేంద్ర ఆ–హబ్‌ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ పూర్వ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌, ప్రిన్సిపాళ్లు ఆచార్య జి.శశిభూషణరావు, ఎస్‌.కె.భట్టి, టి.శోభశ్రీ, వి.విజయలక్ష్మి, ఆ హబ్‌ సీఈవో రవి ఈశ్వరపు పాల్గొన్నారు.

#Tags