Skip to main content

NRIF Rankings : ఉన్న‌త విద్యాసంస్థ‌ల‌కు ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకులు.. ఈ విభాగాల్లో..

రాష్ట్రంలోని 31 ఉన్నత విద్యా సంస్థలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి.
Amaravati higher education institutes recognized nationally  31 institutes achieve top ranks in NIRF 2024  National Institutional Ranking Framework 2024 awards Top-ranked institutions with superior facilities Central Government awards excellence in education  National Institutional Ranking Framework rankings for education institutions in state level

అమరావతి: రాష్ట్రంలోని 31 ఉన్నత విద్యా సంస్థలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. ఉన్నత సదుపాయాలు, ఇతర వనరులతో అత్యుత్తమ ప్రమాణాలు సాధించే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)–2024లో ఉత్త‌మ‌ ర్యాంకులను సాధించాయి. ఆయా విభాగాల్లో గరిష్టంగా 100 సంస్థలకు వాటి ప్రమాణాలు అనుసరించి ర్యాంకులకు ఎంపిక చేసింది. పది అంశాల ప్ర‌తిప‌దికంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులిస్తోంది. అలాగే, అన్ని విభాగాల్లో స్వయం సమృద్ధి సాధించిన సంస్థలకు ఓవరాల్‌ కేటగిరీలో ర్యాంకులు ఇచ్చింది.

Paris Olympics: ఒలింపిక్స్‌ విజేతలకు నగదు బహుమతులు.. ఎవరికి ఎంత ఇస్తున్నారో తెలుసా..?

గతేడాది కంటే పెరిగిన ర్యాంకులు.. 
రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో గణనీయమైన పురోగతిని సాధించాయి. గతేడాది 25 సంస్థలకు ర్యాంకులు దక్కితే.. ఈ ఏడాది ఆ సంఖ్య 31 సంస్థలకు పెరిగింది. ఓవరాల్‌ ర్యాంకుల్లో ఈ ఏడాది మూడు సంస్థలు చోటు దక్కించుకున్నాయి.  

» కేఎల్‌యూ 55.47 స్కోరుతో 40వ ర్యాంకు, ఆంధ్ర వర్సిటీ 54.97 స్కోరుతో 41వ ర్యాంకు, 47.43 స్కోరుతో ఏఎన్‌యూకి 97వ ర్యాంకు వచ్చింది. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీకి 87వ ర్యాంకు దక్కింది. 
»   వర్సిటీల విభాగంలో ఐదు సంస్థలు.. కేఎల్‌యూ, ఆంధ్ర వర్సిటీ, ఏఎన్‌యూ, విజ్ఞాన్, శ్రీవెంకటేశ్వర వర్సిటీలు ర్యాంకులు పొందాయి.  

Chandrababu Govt To Cancel IB Curriculum Syllabus: కూటమి సర్కార్‌ కుట్ర.. పాఠశాలల్లో సీబీఎస్‌ఈకి మంగళం!

»    ఇంజనీరింగ్‌ కాలేజీ విభాగంలోనూ కేఎల్‌యూ, ఐఐటీ తిరుపతి, ఏఎన్‌యూ, విజ్ఞాన్‌ వర్సిటీలకు, మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఐఐఎం–విశాఖపట్నం, కేఎల్‌యూ, క్రియా వర్సిటీ–శ్రీసిటీ సంస్థలు ర్యాంకులను కైవసం చేసుకున్నాయి.  
»  ఫార్మసీ విభాగంలో గతేడాది తొమ్మిది సంస్థలకు ర్యాంకులు వస్తే ఈ ఏడాది ఆరు సంస్థలకు పరిమితమయ్యాయి. ఈ విభాగంలో ఎస్వీ వర్శిటీకి 60వ ర్యాంకు వచ్చి0ది. ఏయూ 34వ ర్యాంకు సాధించింది. 
»    ఇక ఈ ఏడాది కొత్తగా బీఆర్‌ అంబేడ్కర్‌ కాలేజ్‌ ఆఫ్‌ లా, గీతం, దామోదర సంజీవయ్య జాతీయ లా వర్సిటీకి జాతీయ ర్యాంకులొచ్చాయి.  
»    ఆర్కిటెక్చర్‌–ప్లానింగ్‌ విభాగంలో స్పా విజయవాడ, గీతం సంస్థలకు, అగ్రికల్చర్‌ విభాగంలో ఎన్జీరంగా, శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) వెటర్నరీ వర్సిటీలకు ర్యాంకులు పొందాయి. ఎస్వీ వెటర్నరీ వర్సిటీ 33వ ర్యాంకు సాధించింది.

Govt Medical College : ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి బ్రేక్‌.. ఎక్క‌డంటే..!

ఏయూకు ఐదు విభాగాల్లో ర్యాంకులు.. 
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో విశాఖలోని ఆంధ్ర వర్సిటీకి ఐదు విభాగాల్లో ఉత్తమ ర్యాంకులు దక్కాయి.  
»  ఓవరాల్‌ విభాగంలో 41వ స్థానంలో నిలిచి మెరుగైన ప్రదర్శన కనబర్చింది.  
»    దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా చేర్చిన స్టేట్‌ పబ్లిక్‌ వర్సిటీల్లో విభాగంలోనూ జాతీయ స్థాయిలో 65.96 స్కోరుతో 7వ ర్యాంకు పొందింది.  
»   వర్సిటీ కేటగిరీలో 43వ ర్యాంకు,  ఇంజనీరింగ్‌ కేటగిరీలో 90వ ర్యాంకు, ఫార్మసీ విభాగంలో 34వ ర్యాంకులు వచ్చాయి. »  న్యాయ కళాశాల 16వ ర్యాంకు సొంతం చేసుకుంది. 
» ఇక స్టేట్‌ పబ్లిక్‌ వర్సిటీ విభాగంలో ఏయూతో పాటు ఏఎన్‌యూకు  20వ ర్యాంకు, శ్రీవెంకటేశ్వర వర్సిటీకి 39వ ర్యాంకు దక్కాయి. 51–100 మధ్య ర్యాంకుల్లో ఆచార్య ఎన్జీరంగా, జేఎన్‌టీయూ–అనంతపురం, శ్రీపద్మావతి వర్సిటీ, యోగి వేమన వర్సిటీలు నిలిచాయి.

AP Police Jobs Notification 2024 : రాష్ట్రంలో 20 వేల పోలీసు ఉద్యోగాలు.. త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ !

Published date : 13 Aug 2024 03:19PM

Photo Stories