Admissions: ANUలో ‘టీవీ అండ్ ఫిలిం’ పీజీ కోర్సుకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే
సాక్షి, హైదరాబాద్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ టీవీ అండ్ ఫిలిం స్టడీస్ రెండేళ్ల పీజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ విభా గం కోఆర్డినేటర్ మధుబాబు అక్టోబర్ 28న ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కోర్సులో డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిం మేకింగ్, ఆర్ట్ ఆఫ్ ఫిలిం డైరెక్షన్, క్రియేటివ్ లైటింగ్, స్క్రీన్ రైటింగ్, స్టోరీ బోర్డింగ్, సినిమాటోగ్రఫీ, ఫిలిం గ్రామర్, ఫిలిం హిస్టరీ, టీవీ, న్యూస్ రీడింగ్, యాంకరింగ్ వంటి అనేక అంశాల్లో శిక్షణ పొందవచ్చని వివరించారు.
చదవండి: Serum Institute: సినిమాల నిర్మాణంలోకి ప్రవేశిస్తున్న ‘సీరమ్’
కోర్సు ద్వారా సినిమా, టీవీ రంగాల్లో మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సులో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని, లేదా 9393110848 ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags