APOSS Class 10 And 12 Results Out: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు. విద్యార్థులు తమ అడ్మిషన్ నెంబరు లేదా రోల్ నెంబరు వివరాలతో ఫలితాలు చూసుకోవచ్చు.ఈ ఏడాది మార్చి 18 నుంచి 27 వరకు ఓపెన్ స్కూల్ పదోతరగతి,ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు.
ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
పదోతరగతి పరీక్షలకు 31,623 మంది హాజరుకాగా..వారిలో 7,619 మంది అభ్యర్థులు 57.20 శాతం ఉత్తీర్ణతతో ఉత్తీర్ణులయ్యారు.ఇక ఇంటర్ పరీక్షలకు 69,000 మంది హాజరుకాగా, వారిలో 40,919 మంది విద్యార్థులు 62.46 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 55.81శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఇక ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు 73,550 మంది విద్యార్థులు హాజరుకాగా.. 48,377 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 65.77శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. https://apopenschool.ap.gov.in/ ఈ లింక్ ద్వారా డైరెక్ట్‌గా ఫలితాలు తెలుసుకోవచ్చు.
APOSS Class 10, 12 Results.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
1. ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్ apopenschool.ap.gov.inను క్లిక్ చేయండి.
2. హోంపేజీలో కనిపిస్తున్న రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. హాల్‌టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
4. తర్వాతి పేజీలో మీకు రిజల్ట్ అని కనిపిస్తుంది.. డౌన్‌లోడ్ చేసుకోండి.