Ap Schools Summer Holidays 2023 : స్కూళ్లకు మొత్తం వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..? ఈ సారి ముందుగానే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎక్కువ మంది విద్యార్థులు వేస‌వి సెల‌వులు కోసం..ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే విద్యార్థులకు ఎక్క‌వ‌గా వ‌చ్చే సెల‌వుల్లో.. వేస‌వి సెల‌వులే ఎక్కువ‌గా ఉంటాయి.
AP Summer Holidays 2023 Details

అలాగే మ‌రో త‌ర‌గ‌తికి వెళ్లడానికి వేస‌వి సెల‌వుల త‌ర్వాత‌నే అవ‌కాశం ఉంటుంది. దీంతో ఏఏ స్టూడెంట్స్ అయినా ప్రభుత్వం ఎప్పుడు సెలవులు ప్రకటిస్తుందా అని  ఎదురుచూస్తున్నారు. 2022-23 ఏపీ విద్యా సంవత్సరానికి సంబంధించిన అకెడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం.. 1వ త‌ర‌గ‌తి నుంచి 9 తరగతులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 27తో ముగియనున్నాయి. మరో 2 రోజులు ఎగ్జామ్ రిజల్ట్స్ వెల్లడి, పేరెంట్స్  మీటింగ్స్ వంటివి ఉండనున్నాయి.

☛ TS Schools Summer Holidays 2023 : విద్యార్థులకు శుభ‌వార్త‌.. ఈ సారి భారీగానే వేసవి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ఈ సారి సెల‌వులు భారీగానే...?

ఏప్రిల్ 30వ తేదీ నుంచి స్కూల్స్‌కు సెలవులు ఇచ్చే అవకాశం ఉందని ఏపీ విద్యాశాఖ అధికారుల ద్వారా అనధికారికంగా తెలిసింది. అయితే ఉష్టోగ్రతలు ఒక‌వేళ‌ ఎక్కువగా ఉంటే.. ఈ సెలవులు షెడ్యూల్ కాస్త ముందుకు జరిగే అవకాశం కూడా ఉంది. మళ్లీ జూన్ 12 నుంచి స్కూల్స్ పున: ప్రారంభం అవ్వనున్నట్లు సమాచారం. అంటే దాదాపు 45 రోజులు పాటు ఏపీ పాఠ‌శాల‌కు సెలవులు రానున్నాయి. అలాగే తెలంగాణలో ఒంటిపూట బడులు, సెలవులపై ప్ర‌భుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విష‌యం తెల్సిందే.

☛ TS Half Day Schools 2023 : ఒంటి పూట బడులు ఎప్పుటి నుంచి అంటే...? ఈ సారి భారీగానే వేస‌వి సెల‌వులు..

ప‌దో త‌ర‌గ‌తి వారి సెల‌వులు మాత్రం..

పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 19వ తేదీన నుంచి వారికి స‌మ్మ‌ర్ హాలీడేస్‌ ఉంటాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల‌ను ఆరు సబ్జెక్టులకు మాత్రమే నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. పరీక్షల టైమ్ టేబుల్ ఫైనల్ చేసిన నేపథ్యంలో.. పబ్లిక్‌ హాలీడేలు, సాధారణ సెలవులు ప్రకటించినా ఆ రోజుల్లో పరీక్షలు యథాతథంగా జరుగనున్నాయి. స్టూడెంట్స్‌కు కేటాయించిన కేంద్రాల్లో మాత్రమే పరీక్షలను రాయాల్సి ఉంటుందని, ఎగ్జామ్ సెంటర్స్ మార్పును ఎట్టి పరిస్థితుల్లో అమోదించరని ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు గతంలో స్పష్టం చేసిన విష‌యం తెల్సిందే.

టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

2023 ఏడాదిలో సెల‌వులు పూర్తి వివ‌రాలు ఇవే..

పండుగ/పర్వదినం

తేదీ

వారం

భోగి

14–01–2023

శనివారం

మకర సంక్రాంతి

15–01–2023

ఆదివారం

కనుమ

16–01–2023

సోమవారం

రిపబ్లిక్‌ డే

26–01–2023

గురువారం

మహాశివరాత్రి

18–02–2023

శనివారం

హోలి

08–03–2023

బుధవారం

ఉగాది

22–03–2023

బుధవారం

శ్రీరామనవవిు

30–03–2023

గురువారం

బాబు జగజ్జీవన్‌రామ్‌ జయంతి

05–04–2023

బుధవారం

గుడ్‌ ప్రైడే

07–04–2023

శుక్రవారం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి

14–04–2023

శుక్రవారం

రంజాన్‌

22–04–2023

శనివారం

బక్రీద్‌

29–06–2023

గురువారం

మొహర్రం

29–07–2023

శనివారం

స్వాతంత్య్ర దినోత్సవం

15–08–2023

మంగళవారం

శ్రీకృష్ణాష్టమి

06–09–2023

బుధవారం

వినాయకచవితి

18–09–2023

సోమవారం

ఈద్‌ మిలాదున్‌ నబీ

28–09–2023

గురువారం

మహాత్మాగాంధీ జయంతి

02–10–2023

సోమవారం

దుర్గాష్టమి

22–10–2023

ఆదివారం

విజయదశమి

23–10–2023

సోమవారం

దీపావళి

12–11–2023

ఆదివారం

క్రిస్‌మస్‌

25–12–2023

సోమవారం

రెండో శనివారం, ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు ఇవే..

భోగి

14–01–2023

రెండో శనివారం

మకర సంక్రాంతి

15–01–2023

ఆదివారం

దుర్గాష్టమి

22–10–2023

ఆదివారం

దీపావళి

12–11–2023

ఆదివారం

2023లో ఐచ్ఛిక సెలవులు ఇలా..

కొత్త ఏడాది

01–01–2023

ఆదివారం

హజ్రత్‌ అలీ పుట్టినరోజు

05–02–2023

ఆదివారం

షబ్‌–ఇ–బారత్‌

07–03–2023

శుక్రవారం

మహావీర్‌ జయంతి

04–04–2023

మంగళవారం

షబ్‌–ఇ–ఖాదర్‌

18–04–2023

మంగళవారం

జుమాతుల్‌ వాడ

21–04–2023

శుక్రవారం

బసవజయంతి

23–04–2023

ఆదివారం

షహద్‌ హజ్రత్‌ అలీ

24–04–2023

సోమవారం

బుద్ధపూర్ణిమ

05–05–2023

శుక్రవారం

రథయాత్ర

20–06–2023

మంగళవారం

ఈద్‌–ఇ–గదీర్‌

06–07–2023

గురువారం

9వ మొహర్రం

28–07–2023

శుక్రవారం

పార్సీ నూతన సంవత్సరం డే

16–08–2023

బుధవారం

వరలక్ష్మీవ్రతం

25–08–2023

శుక్రవారం

అర్బయిన్‌ (చాహల్లమ్‌)

05–09–2023

మంగళవారం

హజ్రత్‌ సయ్యద్‌ మహమ్మద్‌ జువాన్‌పురి మెహదీ పుట్టినరోజు

09–09–2023

శనివారం

మహాలయ అమావాస్య

14–10–2023

శనివారం

విజయదశమి (తిధిద్వయం)

24–10–2023

మంగళవారం

యాజ్‌–దహుమ్‌–షరీఫ్‌

26–10–2023

గురువారం

కార్తీకపూర్ణీమ/గురునానక్‌ జయంతి

27–11–2023

సోమవారం

క్రిస్మస్‌ ఈవ్‌

24–12–2023

ఆదివారం

బాక్సింగ్‌ డే

26–12–2023

మంగళవారం

తెలంగాణ‌లో స‌మ్మ‌ర్ హాలీడేస్ 2023 ఇవే..

తెలంగాణ ప్ర‌భుత్వం వేసవి సెలవుల షెడ్యూల్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూల్స్‌కు ఈ ఏడాది వేసవి సెలవులు ఉంటాయని విద్యాశాఖ ఇటీవల వెల్లడించింది. తిరిగి పాఠశాలలు జూన్ 12న పాఠశాలలు పున: ప్రారంభం అవ్వనున్నాయి. మొత్తం 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి.

☛➤ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌దో మోడ‌ల్ పేప‌ర్స్ Ebook ( TM & EM)ల కోసం క్లిక్ చేయండి

☛➤ తెలంగాణ ప‌దో మోడ‌ల్ పేప‌ర్స్ Ebook ( TM & EM)ల కోసం క్లిక్ చేయండి

☛➤ ఏపీ, తెలంగాణ ప‌దో స్ట‌డీమెటీరియ‌ల్ PDF ( TM & EM)ల కోసం క్లిక్ చేయండి

#Tags