Cyberabad Police: విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ నిరోధక కమిటీలు

సాక్షి, సిటీబ్యూరో: ర్యాగింగ్‌ భూతాన్ని తుదముట్టించేందుకు సైబరాబాద్‌ పోలీసులు నడుం కట్టారు.

విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ నిరోధక చర్యలకు ఉపక్రమించారు. ప్రిన్సిపాల్స్‌, ప్రొఫెసర్లు, వార్డెన్లు, తల్లిదండ్రులు, విద్యార్థులతో కూడిన ‘యాంటీ ర్యాగింగ్‌ కమిటీ’లను ఏర్పాటు చేయాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: Success Stroy : ఎలాంటి కోచింగ్ లేకుండానే.. ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. కానీ నా ల‌క్ష్యం ఇదే..

విద్యార్థి సంఘాల నాయకులతో సమన్వయంగా ఈ కమిటీలు పని చేయాలని సూచించారు. విద్యా సంస్థల లోపల, చుట్టుపక్కల ప్రదేశాలలో ర్యాగింగ్‌ నిరోధక చట్టాలను హైలెట్‌ చేస్తూ పోస్టర్లను ప్రదర్శించాలన్నారు.

ర్యాగింగ్‌ నిషేధ చట్టం– 1997లోని సెక్షన్‌– 4 ప్రకారం ర్యాగింగ్‌కు పాల్పడితే ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. ర్యాగింగ్‌ చేసి దోషిగా తేలిన వారిని విద్యాసంస్థ నుంచి తొలగిస్తారు. ఆరు నెలలు దాటి జైలు శిక్ష ఖరారైతే ఆ విద్యార్థి మరే ఇతర విద్యా సంస్థలో ప్రవేశం పొందలేడని సీపీ హెచ్చరించారు.

#Tags