Skip to main content

TVVS: విద్యా వలంటీర్లను నియమించాలి

నాంపల్లి: డీఎస్సీ నియామకాలు పూర్తయ్యే వరకు అన్ని జిల్లాల్లో విద్యా వలంటీర్లను సత్వరమే నియమించాలని తెలంగాణ విద్యా వలంటీర్ల సంఘం (టీవీవీఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.కవిత ఆగ‌స్టు 11న‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.
Recruit educational volunteers

రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేపట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని తెలిపారు. అప్పటి వరకు అన్ని జిల్లాల్లో విద్యా వలంటీర్లను నియమించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బాసటగా నిలవాలని కోరారు.

చదవండి: NMMS for Higher Education : విద్యార్థుల ప్ర‌తిభ‌కు ప్రోత్సాహంగా ఎన్ఎంఎంఎస్ ప‌రీక్ష‌.. ఈ విధంగా..

డీఎస్సీ పరీక్షలు ముగిసి వారం రోజులు గడుస్తున్నా ప్రాథమిక కీ ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయ నియామకాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విద్యా వలంటీర్లను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నియమించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

Published date : 12 Aug 2024 05:18PM

Photo Stories