Kishan Reddy: విద్యారంగంపై వాళ్లది నేరమయ నిర్లక్ష్యం
తాజాగా ప్రకటించిన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) లో... రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యంలో నిర్వహించే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల పనితీరు బయటపడిందని వివరించారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ఆగస్టు 13న ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉస్మానియాకు 70వ ర్యాంకా?
‘ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ఓవరాల్ విభాగంలో.. ఉ స్మానియా వర్సిటీ 70వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. కొన్నేళ్లుగా ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవడం అ టుంచితే, ఉన్న స్థానాన్ని నిలబెట్టుకోవడంలోనూ విఫలమై మన యూనివర్సిటీలు దిగజారుతున్నా యి.
కళాశాల విభాగంలో టాప్ 100లో తెలంగాణ నుంచి ఒక్క కాలేజీకీ స్థానం దక్కలేదు.’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితైతే మరింత అధ్వానంగా ఉంది.
ఐటీ క్యాపిటల్‌గా చెప్పుకునే తెలంగాణలో పాఠశాలల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయం లేదు.. 24వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా పెట్టారంటే పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలపై వీరికున్న ప్రేమేంటో అర్థమవుతోంది’’అని కిషన్‌రెడ్డి విమర్శించారు.