Best Education: ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉత్తమ విద్య
Sakshi Education
నిజామాబాద్ అర్బన్: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉత్తమ విద్య అందిస్తున్నట్లు గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, సెంటర్ కో–ఆర్డినేటర్ రంజిత అన్నారు.
నగరలోని కళాశాలలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. యూజీ కోర్సులలో ప్రవేశానికి ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
చదవండి: Open School Admissions: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
రెగ్యులర్ విద్యతో సమానంగా ఉద్యోగ ప్రవేశాలకు ఈ విద్య అందుబాటులో ఉందన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Published date : 14 Aug 2024 10:23AM