Undergraduate Courses: యూనివర్సిటీ హబ్‌తో అల్మా కాలేజ్ భాగస్వామ్యం
లక్డీకాపూల్ : యూనివర్సిటీ హబ్ తో తాము ప్రత్యేక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు అమెరికాకు చెందిన ప్రసిద్ధ ప్రైవేటు విద్యా సంస్థ అల్మా కాలేజ్ ప్రకటించింది.
విద్యాపరంగా అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడిన అల్మా కాలేజ్.. వివిధ రంగాలలో వైవిధ్యమైన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోందన్నారు. మిషిగన్ లోని ఆల్మాలో ఉన్న ఈ కళాశాలను 1886లో స్థాపించారు. అల్మా కాలేజ్‌కుహయ్యర్ లెర్నింగ్ కమిషన్ (హెచ్‌ఎల్‌సీ) గుర్తింపు ఉందని వివరించారు.
చదవండి: National Maths Day: ‘గణితంలో రాణిస్తే జీవితంలో ఉన్నత స్థానం’
ఉన్నత విద్యా ప్రమాణాలను పాటించడంలో సంస్థ అంకితభావానికి ఇది నిదర్శనం. అల్మా కాలేజ్ ప్రవేశాల విభాగం వైస్ ప్రెసిడెంట్ విక్టర్ ఫించ్ మాట్లాడుతూ, అల్మా కాలేజ్‌లో, విద్యార్థులు ఆర్ట్స్, సైన్సెస్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ లాంటి వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించవచ్చన్నారు.
#Tags